
టాలీవుడ్ యంగ్ హీరోలు ఇగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. మల్టీ స్టారర్ సినిమాలకు ఒకే చెప్పటంతో పాటు ఒకరి సినిమాకు ఒకరు ప్రమోషన్ పరంగా సాయం చేసుకుంటున్నారు. ఇదే బాటలో అక్కినేని యువ హీరో సినిమాకు మెగా పవర్ స్టార్ సాయం చేయడానికి రెడీ అవుతున్నాడు. రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రంగస్థలం. సుకుమార్ దర్శకత‍్వంలో పీరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రంగస్థలం సినిమాతో పాటు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి టీజర్ ను కూడా ప్రదర్శిచనున్నారట. ఈ టీజర్ మార్చి 27నే ఆన్‌లైన్‌లో రిలీజ్ కానుంది. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున‍్న సవ్యసాచి సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా మాధవన్, భూమికలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment