డోంట్‌ వర్రీ అంటున్న యంగ్‌​ డైరెక్టర్‌ | Maruthi Tweets about New movie WIth Naga Chaithanya | Sakshi
Sakshi News home page

మీకు ఎలా కావాలో అలానే ఉంటుంది

Published Sat, Mar 24 2018 11:20 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Maruthi Tweets about New movie WIth Naga Chaithanya - Sakshi

డైరెక్టర్‌ మారుతి (ఫైల్‌)

మహానుభావుడు లాంటి క్లాస్‌ హిట్‌ తరువాత కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు దర్శకుడు మారుతి . నాగచైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యుల్‌ కంప్లీట్‌ అయిందని మారుతి ట్వీట్‌ చేశారు. 

ఇటీవలే మొదటి షెడ్యుల్‌ కంప్లీట్‌ అయ్యిందనీ, రెండో షెడ్యుల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామనీ, చైతన్య సవ్యసాచి సినిమాలో బిజీగా ఉన్నాడని త్వరలోనే మళ్లీ షూటింగ్‌ మొదలవుతుందని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. మీకు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా డోంట్‌ వర్రీ అంటూ ట్వీట్‌ చేశారు. మే లో సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో..మారుతీ ఈ సినిమాను కూడా తనదైన శైలీలో కామెడీ, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా మలుచుతున్నారేమో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement