Maruti director
-
క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది: మారుతి
చైతన్యా రావ్, లావణ్య జంటగా చెందు ముద్దు దర్శకత్వంలో యష్ రంగినేని నిర్మించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. ఈ సినిమా జూలై 21న రిలీజ్ కానున్న సందర్భంగా శుక్రవారం టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘1980, 1990 బ్యాక్‌డ్రాప్‌లో ఆ నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్ చూస్తుంటే క్వాలిటీ ఫిల్మ్‌లా అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే మా చిత్రం భిన్నంగా ఉంటుంది’’ అన్నారు చెందు ముద్దు. -
తాతా మనవళ్ళుగా సంజయ్ దత్ ప్రభాస్.. రాయల్?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా మోహనన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే యాభై శాతానికి పైగా పూర్తయింది. ఈ చిత్రానికి ఇప్పటివరకూ ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపించింది. తాజాగా ‘అంబాసిడర్’, ‘రాయల్’ అనే టైటిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారట. మరి..‘రాజా డీలక్స్’ లేదా ‘రాయల్’ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫైనలైజ్ అవుతుందా? లేక మరేదైనా టైటిల్ ఈ సినిమాకు ఖరారు అవుతుందా? అనేది వేచి చూడాలి. ఇక హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా రాజా డీలక్స్ అనే ఒక థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రంలో ప్రభాస్ – బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాతా మనవళ్ళుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ లో కనిపిస్తోంది: శర్వా
‘‘హీరో ఆది సాయికుమార్ని నేను బ్రదర్‌లా భావిస్తాను. ఆదికి సక్సెస్ వస్తే నేనూ ఎంజాయ్ చేస్తాను. నిర్మాత రాధామోహన్ గారు పదేళ్లుగా తెలుసు. నేను హీరోగా చేసిన ‘రన్ రాజా రాన్ ’ ఫ్లేవర్ ‘క్రేజీ ఫెలో’ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు శర్వానంద్. ఆది సాయికుమార్, మిర్నా మీనన్ జంటగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరో శర్వానంద్, దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు మారుతి. ‘‘రాధామోహన్ గారితో తొలి సినిమా చేసే దర్శకులకు విజయం వస్తుంది. అలా ఫణి కృష్ణకు కూడా ‘క్రేజీ ఫెలో’తో విజయం వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సంపత్ నంది. ‘‘క్రేజీ ఫెలో’ హిలేరియస్ ఎంటర్టైనర్. సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది’’ అన్నారు ఆది. ‘‘ఈ సినిమాలో ఆది సాయికుమార్ కొత్తగా కనిపిస్తారు. మేం అందరం క్రేజీగా పని చేశాం’’ అన్నారు ఫణి కృష్ణ. ‘‘ఈ కథకు ఆది బాగా సరిపోయాడు. దర్శకుడిగా ఫణి కృష్ణకు మంచి భవిష్యత్ ఉంది’’ అన్నారు రాధామోహన్ . ఈ కార్యక్రమంలో నటుడు అనీష్ కురువిల్లా, నటి వినోదినీ వైద్యనాథన్, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాస్‌తో సంజూ భాయ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(అభిమానులు ముద్దుగా సంజూభాయ్ అని పిలుస్తారు) స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాడీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. అయితే ఈ మూవీలోని ఓ కీలక పాత్ర కోసం సంజయ్ దత్‌ను సంప్రదించారట మారుతి. హారర్ అండ్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తారా? లేదా? వేచిచూడాలి. టీజర్ రెడీ... ప్రభాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. కాగా ఈ సినిమా టీజర్‌ని అక్టోబరు 2న విడుదల చేయనున్నారని టాక్. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. -
ఈ సినిమా కథ విని షాకయ్యాను: సునీల్
‘‘హాస్యం పండించే హాస్యనటులు ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం ఓ డేరింగ్ స్టెప్. ఇక్కడే మొదటి విజయం సాధించింది ఈ చిత్రం. సునీల్, ధన్ రాజ్ లాంటి మంచి నటులతో జి. నాగేశ్వరరెడ్డిగారు ఇలాంటి థ్రిల్లర్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది’’ అన్నారు దర్శకుడు మారుతి. సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో కెమెరామేన్ ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుజ్జి.. ఇలారా’. రూపా జగదీష్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, జి. నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు మారుతి హాజరయ్యారు. ధన్‌రాజ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు అసలైన స్టార్స్ నిర్మాతలే. నాపై నమ్మకంతో నాలుగు కోట్లు ఖర్చుపెట్టారు. ఈ కథకు నేనే కరెక్ట్ అని నమ్మి, నాతో సినిమా చేసి అండగా నిలబడ్డారు నాగేశ్వరరెడ్డిగారు’’ అన్నారు.‘‘ఈ సినిమా కథ విని షాకయ్యాను. మంచి సందేశం ఉంది’’ అన్నారు సునీల్. ‘‘ఈ సినిమాతో దర్శకత్వం ఎంత కష్టమో తెలిసింది’’ అన్నారు అంజి. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు నిర్మాతలు. -
క్షణక్షణం కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది
‘‘సస్పెన్స్, డార్క్ కామెడీ జానర్‌తో పాటు కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘క్షణక్షణం’ సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కూడా ఉత్కంఠగా సాగుతుందని తెలిసింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ‘ఆటగదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్ హీరోగా, జియా శర్మ హీరోయిన్గా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్షణక్షణం’. డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని మారుతి విడుదల చేశారు. ఉదయ్ శంకర్ మాట్లాడుతూ– ‘‘క్షణక్షణం’లో డార్క్ కామెడీ బాగా కుదిరింది. మా సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడంతో పాటు, మా టీమ్‌కి పెద్ద సక్సెస్ అందిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్‌గా తీశాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది.. దీంతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. మా సినిమా ప్రేక్షకుల్ని ఎక్కడా రిలాక్స్ కానివ్వదు. సందర్భానికి తగ్గట్టు వచ్చే పాటలు సినిమా మూడ్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి’’ అన్నారు కార్తీక్ మేడికొండ. శ్రుతీసింగ్, సంగీత దర్శకులు కోటి, రఘుకుంచె, రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కె. సిద్ధార్థ్ రెడ్డి, సంగీతం: రోషన్ సాలూరి. -
పీనట్ డైమండ్ హిట్ అవ్వాలి
‘‘వెంకటేశ్ పదేళ్లుగా నాకు తెలుసు.. అతను తెరకెక్కించిన ‘పీనట్ డైమండ్’ సినిమా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా, చాందినీ తమిళరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పీనట్ డైమండ్’. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్‌పై అభినవ్ సర్దార్, వెంకటేశ్ త్రిపర్ణ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మారుతి విడుదల చేశారు. అభినవ్ సర్దార్, వెంకటేశ్ త్రిపర్ణ మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనిధి నక్కా. -
లాక్‌డౌన్‌ని అలా ఉపయోగించుకున్నాను
‘‘నా మాతృసంస్థలు యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్లో రూపొందే ఓ సినిమా చేస్తున్నాను. ఫిబ్రవరి నుండి షూటింగ్‌కి వెళ్లే మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. షూటింగ్స్ పరంగా త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయి’’ అన్నారు దర్శకుడు మారుతి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► నేనెప్పుడూ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో ఓ సినిమా తర్వాత మరో సినిమా చేస్తాను. ఒక కథ తర్వాత మరో కథ రాస్తాను. లాక్డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయంలో స్టోరీ డిస్కషన్స్‌తో పాటు కొత్త కథలు రాసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో మూడు కథలు రెడీగా ఉన్నాయి. లాక్డౌన్ మొత్తాన్ని ఇలా కథలు రాయడానికి ఉపయోగించుకున్నాను. రెడీగా ఉన్న కథలను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాను. ► కరోనా కారణంగా నిర్మాణం పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు సినిమాలు చూడటం ఆపలేదు. అనేక రకాల జానర్ సినిమాలను చూడటానికి అలవాటు పడ్డారు. సినిమా నిర్మాణానికి సంబంధించి త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నాను. ► అసలు థియేటర్లలో సినిమా లేకపోవటం కన్నా, ముందు ఓ 50 శాతం మందితో థియేటర్లు తెరుచుకోవటం ఆనందమే కదా. జనవరికి 100 శాతం ప్రేక్షకులతో సినిమా థియేటర్లు ఉంటాయనుకుంటున్నాను. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని వచ్చినా సినిమా థియేటర్‌కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఓటీటీ కారణంగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొత్త కంటెంట్ ఉన్న కథలతో పాటు కొత్త టాలెంట్ పరిశ్రమకు వస్తుంది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను. ఈ వెబ్ సిరీస్‌ను అంతా కొత్త టీమ్ హ్యాండిల్ చేస్తోంది. -
ట్రెండీ ప్రేమ పిపాసి
‘‘ప్రేమపిపాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, ఎంగేజింగ్‌గా ఉంది. ట్రైలర్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో సినిమా కూడా అలాగే ఉంటుందన్న నమ్మకం ఉంది. కొత్తవాళ్ల ప్రయత్నం బాగుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. జీపీయస్ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి (ఎమ్ఆర్ ) దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. పి.ఎస్.రామకష్ణ (ఆర్.కె) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని మారుతి విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రేమ అనేది ఎంతో వాణిజ్యంగా మారిపోయింది. నిజాయతీ ప్రేమను వెతికేవాళ్లు మా సినిమా చూడొచ్చు’’ అన్నారు మురళీ రామస్వామి అన్నారు. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు పి.యస్.రామకష్ణ. జీపీయస్, సహ నిర్మాత రాహుల్ పండిట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జీఎస్ రావు, వై. వెంకటలక్ష్మి, అసోసియేట్ ప్రొడ్యూసర్: యుగంధర్ కొడవటి. -
ఈ విజయం ఆ ఇద్దరిదే
‘‘ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం మారుతి, సాయి తేజ్‌లదే. ఈ ఇద్దరూ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారు. మంచి సినిమా తీసిన యూనిట్‌ని అభినందిస్తున్నాను’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి తేజ్ మాట్లాడుతూ–‘‘ప్రతిరోజూ పండగే’ నా కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా. ఇలాంటి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన మారుతిగారికి థ్యాంక్స్. సత్యరాజ్‌గారి పాత్రను మర్చిపోలేను. రావు రమేశ్‌గారితో నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితం ఇస్తున్నా’’ అన్నారు. ‘‘ఈ కథ రాసుకున్నప్పుడు రాజమండ్రిలో చిత్రీకరించాలనుకున్నాను. సక్సెస్‌మీట్‌ను రాజమండ్రిలోనే నిర్వహించాలని షూటింగ్ అప్పుడే అనుకున్నాను.. ఇప్పుడు చేశాం’’ అన్నారు మారుతి. ‘‘తేజూ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తికి ఇంత మంచి విజయం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత ‘బన్నీ’ వాస్. -
నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది
‘‘యంగ్∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా. సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్ ఎదురవగానే నా కెరీర్ అయిపోయిందని చాలామంది జోక్స్ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్ దక్కింది. నా కెరీర్లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్. ‘‘థియేటర్లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్, పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
ఇది చాలదని చరణ్ అన్నారు
‘‘మనకు నచ్చిన పని చేస్తూ, మనవారితో సంతోషంగా ఉంటే ‘ప్రతిరోజూ పండగే’. అందుకు తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు కావాలి’’ అన్నారు సాయితేజ్. మారుతి దర్శకత్వంలో సాయితేజ్, రాశీఖన్నా జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఎస్కేఎన్ ఈ చిత్రానికి సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి తేజ్ చెప్పిన సంగతులు. ► ఇది తాత–మనవడి కథ. ఐదు వారాల్లో తాత చనిపోతాడని తెలిసి, ఆయన బతికి ఉన్నంత కాలం సంతోషంగా ఉంచాలనుకుంటాడు మనవడు. తాత కోసం ఆ మనవడు ఏం చేశాడు? తాత తన జీవితంలో చేయాలనుకుని చేయలేని పనులను మనవడి సాయంతో చివరి రోజుల్లో ఎలా చేశారు? అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇందులో తాత పాత్రలో సత్యరాజ్‌గారు, మనవడి పాత్రలో నేను నటించాను. నా తండ్రి పాత్రలో రావు రమేష్‌గారు నటించారు. ఉగాది పచ్చడిలా ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో ఉన్న డైనింగ్ టేబుల్ సన్నివేశం తీసేటప్పుడు నా నిజ జీవితంలోని కొన్ని సంఘటనలకు కనెక్ట్ అయ్యాను. ► దాదాపు పదేళ్ల క్రితం మారుతి అన్నను ఓ సంద ర్భంలో కలిశాను. అప్పుడు ఓ కథ చెప్పారు. నిజానికి నాకు అప్పటికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కానీ, కథ విన్నా. మారుతి అన్న డైరెక్షన్లో సినిమా చేయడం ఇప్పటికి కుదిరింది. అయితే అప్పుడు ఆయన చెప్పిన కథ ఇది కాదు. మా సినిమా విడుదలవుతున్న రోజునే మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. మా సినిమాతో పాటు అవికూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ► ‘చిత్రలహరి’ సినిమా కోసం బరువు పెరిగాను. ‘ప్రతిరోజూ పండగే’ కోసం దాదాపు 20 కేజీలు తగ్గాను. ఈ సినిమాలో ‘హోమం’ చేస్తున్న ఓ సన్నివేశంలో ఫైట్ సీన్ కోసం షర్ట్ విప్పాల్సి ఉంటుంది. ్ఞఅలా ఆ సీన్లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాను. ► ఓసారి నేను వర్కౌట్స్ చేస్తున్నప్పుడు చరణ్ (రామ్‌చరణ్) చూశారు. ‘ఇది చాలదు’ అని ‘ధృవ’ సమయంలో తనకు జిమ్ ట్రైనర్‌గా ఉన్న రాకేష్ ఉదయార్ను సూచించారు. సరైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాను. మరోసారి బరువు పెరిగి తగ్గాలనుకోవడం లేదు. అంత ఓపిక లేదు (నవ్వుతూ). ► చిరంజీవిగారు ‘ప్రతిరోజూ పండగే’ కథ విన్నారు. బాగా చేయాలన్నారు. చిరంజీవిగారి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. అది నాకు ప్లస్సో, మైనస్సో అనుకోవడం లేదు. ఒక బాధ్యతగా భావిస్తున్నాను. -
రహస్యం హిట్ అవ్వాలి
‘‘సినిమాల మీద మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణగారు. చిన్న సినిమాలు తీసి, విజయవంతంగా విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఆయన నిర్మించిన ‘రహస్యం’ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా రెండో ట్రైలర్‌ని మారుతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని శైలేష్ స్టైల్‌గా తెరకెక్కించాడు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్, అతని టీమ్ బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. దర్శకునిగా తనకు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు (రామ్‌గోపాల్ వర్మ). ప్రతి కొత్త డైరెక్టర్ తమ చిత్రాలను ఆర్జీవీగారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటారు. సాగర్ శైలేష్ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి ‘రహస్యం’ సినిమా తీసాడు’’ అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక పాల్గొన్నారు. -
డోంట్ వర్రీ అంటున్న యంగ్ డైరెక్టర్
మహానుభావుడు లాంటి క్లాస్ హిట్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు మారుతి . నాగచైతన్య హీరోగా శైలజారెడ్డి అల్లుడు సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యుల్ కంప్లీట్ అయిందని మారుతి ట్వీట్ చేశారు. ఇటీవలే మొదటి షెడ్యుల్ కంప్లీట్ అయ్యిందనీ, రెండో షెడ్యుల్ కోసం వెయిట్ చేస్తున్నామనీ, చైతన్య సవ్యసాచి సినిమాలో బిజీగా ఉన్నాడని త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలవుతుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. మీకు ఎలా కావాలో అలానే ఉంటుంది సినిమా డోంట్ వర్రీ అంటూ ట్వీట్ చేశారు. మే లో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. సో..మారుతీ ఈ సినిమాను కూడా తనదైన శైలీలో కామెడీ, మాస్ ఎంటర్టైనర్గా మలుచుతున్నారేమో చూడాలి. No doubt meeku ela kavalo alane untundi #chaymovie dont wry... — Maruthi dasari (@DirectorMaruthi) March 24, 2018 Hi friends...andaru #chaymovie gurinchi aduguthunnaru.1st scedule complete chesam.kani ayana savya sachi lo busy..nenu me lage waiting lo unna... i think may lo look istha...pls wait bros.. — Maruthi dasari (@DirectorMaruthi) March 24, 2018 -
కితకితలు పెట్టే... ఎక్స్‌ప్రెస్ రాజా!
సంక్రాంతి అనగానే తెలుగు జనాలకు గుర్తొచ్చేవి కోడిపందేలు, కొత్త సినిమాలే. కూత పెట్టేందుకు కోళ్లు ఎలా సిద్ధమవుతు న్నాయో... బాక్సాఫీస్ బరిలో నిలిచేందుకు కొత్త సినిమాలు కూడా అలాగే ముస్తాబవు తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోటాపోటీగా నాలుగు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో బాలకృష్ణ, నాగార్జున, చిన్న ఎన్టీఆర్ వంటి హేమాహేమీల చిత్రాలు న్నాయి. మామూలుగా అయితే స్టార్ కథానాయకుడు నటించిన ఒక సినిమా విడుదలవుతోందనగానే... మిగిలిన సినిమాలు వెనక్కి వెళ్లే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ ఏకంగా ముగ్గురు స్టార్ కథానాయకుల సినిమాలు వస్తున్నప్పటికీ... వాటి మధ్యలో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి నాన్‌స్టార్ సినిమా విడుదలవుతుండటం విశేషం. మూడు చిత్రాలు పందెం కోళ్లలాగా పౌరుషంతో కూడిన కంటెంట్‌తో వస్తుంటే... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మాత్రం కితకితలతోనే బాక్సాఫీసుని గెలుస్తానన్న ధీమాతో కనిపిస్తున్నాడు. ఆ ధీమాకు తగ్గట్టుగానే సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ క్రియేటయ్యింది. మూడు సినిమాల గురించి జనం ఎంతగా మాట్లాడుకుంటున్నారో... ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. ఒక విజయవంతమైన కలయికతో రూపొందిన చిత్రం కావడమే అందుకు కారణం. ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి హిట్లతో దూసుకెళుతున్న కథానాయకుడు... శర్వానంద్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో హిట్ సాధించిన దర్శకుడు మేర్లపాక గాంధీ. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ వంటి చిత్రా లతో వరుస విజయాలందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్. వీళ్లంతా కలసి సినిమా చేస్తున్నారంటే ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ పై కూడా మొదట్నుంచీ ఆ రూపంలోనే పాజిటివ్ బజ్ క్రియేటయ్యింది. దాంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అలాంటి సినిమా సంక్రాంతి లాంటి ఒక మంచి సీజన్లో విడుదలవుతోందంటే ఇక తిరుగేముంటుంది. దానికితోడు ‘దిల్’ రాజు లాంటి ఓ అగ్ర నిర్మాత, మారుతీ లాంటి అగ్ర దర్శకుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకున్నారు. సినిమా నిర్మాణంలో యువీ క్రియేషన్స్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. కథానాయకుడు స్టార్ కాకపోయినా సరే... కంటెంట్‌ని నమ్మి ఖర్చుకి వెనకాడకుండా సినిమాను నిర్మిస్తుంటుంది. ప్రచార కార్యక్రమాల్నీ దీటుగా నిర్వహిస్తుంటుంది. ‘రన్ రాజా రన్’, ‘భలే భలే మగాడివోయ్’ అందుకు ఉదాహరణ. ఆ చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో, స్టార్ కథానాయకుల చిత్రాలకు దీటుగా వసూళ్లను సొంతం చేసుకున్నాయి. వాటి స్ఫూర్తితో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తెరకెక్కింది. ఇటీవలే కథానాయకుడు ప్రభాస్ చేతుల మీదుగా పాటలు విడుదలయ్యాయి. యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థతో సమానం. ఆయన పాటల వేడుకకి హాజరవడంతో సినిమాకు మంచి ప్రచారం లభించింది. థియేటర్ ట్రైలర్లకూ ఆదరణ లభించింది. మేర్లపాక గాంధీ మంచి వినోదా త్మక చిత్రాన్ని తీశాడని ట్రైలర్లని చూస్తే తెలుస్తోంది. శర్వానంద్, సురభి జంటగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రభాస్’ శ్రీను, సప్తగిరి తదితర హాస్యనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14న ఈ చిత్రం రిలీజవుతోంది. ‘‘యువీ క్రియేషన్స్ అంటే నాకు మొదటి నుంచి మంచి అభిమానం. క్వాలిటీ సినిమాలు తీస్తారు. వంశీ, ప్రమోద్ మంచి టేస్టున్న నిర్మాతలు. ‘భలే భలే మగాడివోయ్’ తో మా మధ్య స్నేహం మరింత బలపడింది. ఆ అనుబంధంతోనే ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తొలి కాపీని చూపించారు వంశీ. సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేశా. వినోదం నాకు బాగా నచ్చింది. దాంతో నేను, నా మిత్రులు కలసి కృష్ణా జిల్లాలో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నాం.’’ - మారుతి, దర్శకుడు