Buzz: Prabhas And Sanjay Dutt Will Play Grandson And Grandfather Role In Raja Deluxe Movie - Sakshi
Sakshi News home page

తాతా మనవళ్ళుగా సంజయ్‌ దత్‌ ప్రభాస్‌.. రాయల్‌?

Published Thu, Jun 22 2023 3:49 AM | Last Updated on Thu, Jun 22 2023 11:36 AM

Prabhas next movie title Rraja deluxe - Sakshi

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే యాభై శాతానికి పైగా పూర్తయింది. ఈ చిత్రానికి ఇప్పటివరకూ ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ వినిపించింది.

తాజాగా ‘అంబాసిడర్‌’, ‘రాయల్‌’ అనే టైటిల్స్‌ను కూడా పరిశీలిస్తున్నారట. మరి..‘రాజా డీలక్స్‌’ లేదా ‘రాయల్‌’ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫైనలైజ్‌ అవుతుందా? లేక మరేదైనా టైటిల్‌ ఈ సినిమాకు ఖరారు అవుతుందా? అనేది వేచి చూడాలి. ఇక హారర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా రాజా డీలక్స్‌ అనే ఒక థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, ఈ చిత్రంలో ప్రభాస్‌ – బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ తాతా మనవళ్ళుగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement