
‘‘వెంకటేశ్ పదేళ్లుగా నాకు తెలుసు.. అతను తెరకెక్కించిన ‘పీనట్ డైమండ్’ సినిమా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా, చాందినీ తమిళరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్లుగా వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పీనట్ డైమండ్’. ఎఎస్‌పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్‌పై అభినవ్ సర్దార్, వెంకటేశ్ త్రిపర్ణ నిర్మించిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మారుతి విడుదల చేశారు. అభినవ్ సర్దార్, వెంకటేశ్ త్రిపర్ణ మాట్లాడుతూ– ‘‘సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె. ప్రభాకర రెడ్డి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షాని సాల్మన్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీనిధి నక్కా.
Comments
Please login to add a commentAdd a comment