‘‘నా మాతృసంస్థలు యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కాంబినేషన్‌లో రూపొందే ఓ సినిమా చేస్తున్నాను. ఫిబ్రవరి నుండి షూటింగ్‌కి వెళ్లే మరికొన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. షూటింగ్స్ పరంగా త్వరలోనే మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయి’’ అన్నారు దర్శకుడు మారుతి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు.
► నేనెప్పుడూ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో ఓ సినిమా తర్వాత మరో సినిమా చేస్తాను. ఒక కథ తర్వాత మరో కథ రాస్తాను. లాక్‌డౌన్ వల్ల వచ్చిన ఖాళీ సమయంలో స్టోరీ డిస్కషన్స్‌తో పాటు కొత్త కథలు రాసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో మూడు కథలు రెడీగా ఉన్నాయి. లాక్‌డౌన్ మొత్తాన్ని ఇలా కథలు రాయడానికి ఉపయోగించుకున్నాను. రెడీగా ఉన్న కథలను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాను.
► కరోనా కారణంగా నిర్మాణం పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రేక్షకులు సినిమాలు చూడటం ఆపలేదు. అనేక రకాల జానర్ సినిమాలను చూడటానికి అలవాటు పడ్డారు. సినిమా నిర్మాణానికి సంబంధించి త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నాను.
► అసలు థియేటర్లలో సినిమా లేకపోవటం కన్నా, ముందు ఓ 50 శాతం మందితో థియేటర్లు తెరుచుకోవటం ఆనందమే కదా. జనవరికి 100 శాతం ప్రేక్షకులతో సినిమా థియేటర్లు ఉంటాయనుకుంటున్నాను. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎన్ని వచ్చినా సినిమా థియేటర్‌కి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఓటీటీ కారణంగా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. కొత్త కంటెంట్ ఉన్న కథలతో పాటు కొత్త టాలెంట్ పరిశ్రమకు వస్తుంది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాను. ఈ వెబ్ సిరీస్‌ను అంతా కొత్త టీమ్ హ్యాండిల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment