
ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో కనిపించిన అక్కినేని హీరో నాగచైతన్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. అయితే ఆ ప్రభావం తన తదుపరి చిత్రాల మీద పడకుండా జాగ్రత్త పడుతున్నాడు చైతూ. అందుకే త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసం ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు.
ప్రేమమ్ సినిమాతో తనకు ఘనవిజయం అందించిన చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు చైతన్య. సవ్యసాఛి పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యింది. కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా బాలీవుడ్ బ్యూటి నిధి అగర్వాల్ ను ఫైనల్ చేశారు.
టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయిన నిధి, తొలి సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా.. హాట్ బ్యూటీ ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకుంది. ఇప్పుడు సక్సెస్ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది. మరి నాగచైతన్య అయిన ఈ భామకు సక్సెస్ అందిస్తాడేమో చూడాలి.