చైతూ, మాధవన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా | Naga Chaitanya And Madhavan Combination | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 2 2018 2:19 PM | Last Updated on Sat, Jun 2 2018 3:53 PM

Naga Chaitanya And Madhavan Combination - Sakshi

డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్‌, ఇన్నేళ్లలో ఒక్క స్ట్రయిట్‌ తెలుగు సినిమా కూడా చేయలేదు. అయితే త్వరలో రిలీజ్‌ కు రెడీ అవుతున్న నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు మ్యాడీ. అంతేకాదు ఈ సినిమాలో మాధవన్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

తాజాగా సమాచారం ప్రకారం నాగచైతన్య, మాధవన్‌లు మరో సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా పూర్తయిన వెంటనే నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. సమంత హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్‌ను కీలక పాత్రలో నటింప చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement