
ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ లవ్ కపుల్ నాగచైతన్య, సమంతలు తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నారు. సమంత ఇప్పటికే రంగస్థలం యూనిట్ తో జాయిన్ అవ్వగా ఈ రోజు నుంచి నాగచైతన్య కూడా షూటింగ్‌కు హాజరయ్యాడు. చందూమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూకు జోడిగా నిథి అగర్వాల్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్నఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణీ స్వరాలందిస్తున్నారు.
ఈరోజు షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని కన్ఫమ్ చేస్తూ సవ్యసాచి సెట్‌లో యూనిట్‌తో కలిసి దిగిన ఫొటోను తన సోషల్‌మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన చైతూ ‘తిరిగి పని ప్రారంభించాం’ అంటూ కామెంట్ చేశాడు. సవ్యసాచి సినిమా సెట్స్ మీద ఉండగానే మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించనున్నాడు ఈ అక్కినేని అందగాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సవ్యసాచి తొలి షెడ్యూల్ పూర్తయిన తరువాత శైలజా రెడ్డి అల్లుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Back to work ! #Savyasachi pic.twitter.com/ymZkj82YUL
— chaitanya akkineni (@chay_akkineni) 8 November 2017