‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన సవ్యసాచి టీజర్ ఆకట్టుకుంటోంది. సోమవారం విడుదలైన ఈ టీజర్‌ను చూస్తే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని.. ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.