
నాగా చైతన్య
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు ఈ యంగ్ హీరో.
నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment