Naag chaitanya
-
నాగచైతన్య ‘ప్రేయసి’..?
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు ఈ యంగ్ హీరో. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
వైరల్ : సమంత, నాగచైతన్యల పెళ్లి శుభలేఖ
ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈవెంట్.. సమంత, నాగచైతన్యల పెళ్లి వేడుక. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట శుక్రవారం పెద్దల సమక్షంలో ఒక్కటవుతున్నారు. కేవలం మూడు కుంటుబాలకు చెందిన వారు మాత్రమే హజరవుతున్న ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల ఆశీస్సులతో గోవాలోని డబ్ల్యూ హోటల్ లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 6) మద్యాహ్నం నుంచి వేడుక మొదలుకానుంది. మద్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మెహందీ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత 8 గంటల 30 నిమిషాలకు విందు, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది. ఇక శనివారం(అక్టోబర్ 6) రోజున క్రిస్టియన్సాంప్రదాయ ప్రకారం జరగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరోజు మద్యాహ్నం 12 గంటలనుంచి మూడు గంటల వరకు విందు ఏర్పాట్లు చేసిన అక్కినేని కుటుంబ సభ్యులు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి విందుతో పాటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు. -
రానా కెరీర్లో తొలిసారి..!
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సత్తా చాటుతున్న యువ నటుడు రానా. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. హీరో క్యారెక్టరే చేస్తానంటూ పట్టుపట్టకుండా, మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రానా. బాహుబలి సినిమా నేషనల్ స్టార్ గా మారిన ఈ మేన్లీ స్టార్ సోలో హీరోగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఓ టీవీ షోలో భాగంగా రానా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నెం. 1 యారి విత్ రానా షోలో పాల్గొన్న నాగచైతన్య, సుమంత్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇంతవరకు తన చేసిన సినిమాల్లో తనపై పెళ్లి సీన్లు చిత్రీకరించలేదని, తొలిసారిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలోనే పెళ్లి సీన్లో నటించానని తెలిపాడు. అయితే నిజజీవితంలో పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు మాత్రం రానా సమాధానం చెప్పలేదు.