
ప్రస్తుతం దక్షిణాది ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆసక్తిగా గమనిస్తున్న ఈవెంట్.. సమంత, నాగచైతన్యల పెళ్లి వేడుక. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట శుక్రవారం పెద్దల సమక్షంలో ఒక్కటవుతున్నారు. కేవలం మూడు కుంటుబాలకు చెందిన వారు మాత్రమే హజరవుతున్న ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల ఆశీస్సులతో గోవాలోని డబ్ల్యూ హోటల్ లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. శుక్రవారం (అక్టోబర్ 6) మద్యాహ్నం నుంచి వేడుక మొదలుకానుంది. మద్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మెహందీ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరువాత 8 గంటల 30 నిమిషాలకు విందు, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.
ఇక శనివారం(అక్టోబర్ 6) రోజున క్రిస్టియన్సాంప్రదాయ ప్రకారం జరగనున్న వివాహానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరోజు మద్యాహ్నం 12 గంటలనుంచి మూడు గంటల వరకు విందు ఏర్పాట్లు చేసిన అక్కినేని కుటుంబ సభ్యులు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి విందుతో పాటు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment