‘ఖుషి’ సమంత రియల్‌ స్టోరీ కాదు.. అలాంటి సామ్‌ని చూస్తారు: డైరెక్టర్‌ | Director Shiva Nirvana Gives Clarity On Rumours About That Kushi Movie Is Real Life Story Of Samantha - Sakshi
Sakshi News home page

Kushi Director Shiva Nirvana: ‘ఖుషి’ సమంత రియల్‌ స్టోరీ కాదు.. అలాంటి సామ్‌ని చూస్తారు

Published Tue, Aug 29 2023 5:41 PM | Last Updated on Tue, Aug 29 2023 5:55 PM

Siva Nirvana Talk About Kushi Movie - Sakshi

‘సమంత ప్రస్తుతం డిఫరెంట్‌ జానర్స్‌ చేస్తుంది. ఆమె నుంచి ఓ మంచి లవ్‌స్టోరీ వచ్చి చాలా కాలం అవుతుంది. చాలా కాలం తర్వాత లవ్‌స్టోరీ ‘ఖుషి’ చేస్తుంది. తెరపై వింటేజ్‌ సమంతను చూస్తారు’అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. ఆయన దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, శివ నిర్వాణ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్  నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని. ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం.

► ‘ఖుషి’ మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలూ వచ్చాయి కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి.

► ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయ్యింది. కానీ ఫస్టాఫ్ లో లవ్ స్టోరిని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్ గుడ్ ప్లేస్,  ప్లెజంట్ గా ఉండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. మీరు ట్రైలర్ లో చూసినట్లు హీరో హీరోయిన్ ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి.

► ‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసి మాట్లాడినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కు చెప్పగానే ఆయన కూడా ఓకే అన్నారు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. నా రోజా నువ్వే  హిందీ సహా అన్ని లాంగ్వేజెస్ లో హిట్టయ్యింది. మ్యూజిక్ కు మంచి పేరొచ్చింది కాబట్టి ఆ మ్యూజిక్ తోనే సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని అనుకుని మ్యూజిక్ కన్సర్ట్ పెట్టాం. ఇది విజయ్ చెప్పిన ఆలోచనే.

► విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. 

► ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే  చేసింది అంతే.

► బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడి పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు  నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. పాన్ ఇండియాకు చేయాలని మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ థియేటర్ లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement