అసలు సవ్యసాచి అంటే ఎవరు? | Savyasachi First Look Poster Out | Sakshi
Sakshi News home page

సవ్యసాచి ఫస్ట్‌ లుక్‌ విడుదల

Published Fri, Mar 16 2018 10:57 AM | Last Updated on Fri, Mar 16 2018 12:06 PM

Savyasachi First Look Poster Out - Sakshi

సాక్షి, సినిమా : రెండు చేతుల్ని సమర్థంగా.. శక్తివంతంగా వాడేవాళ్లనే సవ్యసాచి అంటారు. అదే టైటిల్‌ను నాగ చైతన్య కొత్త చిత్రానికి ఫిక్స్‌ చేయగా.. ఇప్పుడు ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్లు విడుదల చేశారు. 

మహాభారతంలో అర్జునుడి అయిదో పేరు సవ్యసాచి. ఎందుకంటే అర్జునుడు రెండు చేతులతో ఒకే వేగంతో విలువిద్య ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతులను సమర్థవంతంగా వాడి పరిస్థితులను, ప్రత్యర్థులను ఎదుర్కొంటాడు అంటూ ఓ సందేశంతో పోస్టర్‌ను వదిలారు. బ్యాక్‌ గ్రౌండ్‌లో చేతులు.. వాటిపై రాతలు... సీరియస్‌గా ఉన్న చైతూ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.

మైత్రి మూమీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్‌ చేస్తుండగా.. నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్‌ నటిస్తోంది. కీరవాణి మ్యూజిక్‌ అందిస్తుండగా.. మాధవన్‌, భూమికలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement