నాగచైతన్య స్వార్థపరుడు..! | Naga Chaitanya Plays Egoist in Maruthi Film | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 27 2017 10:45 AM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

Naga Chaitanya Plays Egoist in Maruthi Film - Sakshi

పెళ్లి తరువాత తిరిగి షూటింగ్ లతో బిజీ అయిన అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ, ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే ప్రకటించినట్టుగా మారుతి దర్శకత్వం‍లో ఓ సినిమా చేయబోతున్నాడు చైతన్య.

మారుతి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తన సినిమాల్లో హీరోలకు ఏదో ఒక వీక్‌నెస్ పెట్టే దర్శకుడు మారుతి, నాగచైతన్యను స్వార్థపరుడిగా చూపించనున్నాడట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement