బహు భాషా నటుడు మాధవన్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. తన సినిమాలతో బిజీగా ఉంటూ.. అప్పుడప్పుడు సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండే ఈ హీరో, తాజాగా కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ ఐటీ విభాగం ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ రిలీజ్ చేసిన వీడియో వివాదస్పదంగా మారింది.