
సోషల్ మీడియా హడావిడి స్టార్టయిన తర్వాత సెలబ్రిటీలకు ట్రోల్స్ సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మాధవన్ చేరారు. మాధవన్‌ను ఉద్దేశించి ఓ యువతి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. ‘‘రెహ్నా హై తేరా దిల్ మే’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఎంత అందంగా ఉండేవాడో మాధవన్. మ్యాడీకి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని.
కానీ, ఇప్పుడేమో ఆయన తాగుడుకు బానిసై, డ్రగ్స్ తీసుకుంటూ ఓ పక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, కెరీర్‌లో కూడా వెనకపడి పోవటం చూసి చాలా బాధగా ఉంది’’ అని ఆ యువతి సోషల్ మీడియా సాక్షిగా పేర్కొంది.
సాధారణంగా తన గురించి వచ్చే మంచీ చెడూ విషయాలకు స్పందించని మాధవన్ ఈ పోస్ట్‌కి మాత్రం సమాధానం చెప్పారు. ‘‘సో.. మీ రోగ నిర్ధారణ అదన్నమాట. మీలాంటి పేషెంట్లను చూస్తుంటే నాకు ఆందోళనగా ఉంటుంది. నువ్వు డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది’’ అని కౌంటరిచ్చారు మాధవన్. మరోవైపు మాధవన్ అభిమానులు.. ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తూ, ‘నీకు చూపు మందగించిందేమో.. డాక్టర్‌కి చూపించుకో’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment