మూడునెలలుగా ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్‌.. ఏదో తెలుసా? | Madhavan Mini Series Creates New Milestone On Netflix OTT Platform | Sakshi
Sakshi News home page

OTT: 36 దేశాల్లో ట్రెండ్‌ అవుతున్న ఇండియన్‌ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే!

Published Wed, Mar 13 2024 5:25 PM | Last Updated on Wed, Mar 13 2024 5:36 PM

Madhavan Mini Series Creates New Milestone On Netflix OTT Platform - Sakshi

ఏ సినిమా అయినా ఓటీటీలోకి రాగానే కొద్దోగొప్పో గుర్తింపు వస్తుంది. సినిమా బాలేదంటే రెండు, మూడు రోజుల్లోనే దాన్నెవరూ పట్టించుకోరు. అదే బాగుందంటే మాత్రం వెంటనే టాప్‌ 10లో ట్రెండింగ్‌ అవుతుంది. అయితే కొత్త సినిమా రాగానే కాస్త వెనకబడిపోతుంది. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ వెబ్‌ సిరీస్‌ మాత్రం రోజులు, వారాలుగా కాదు ఏకంగా మూడు నెలల నుంచి టాప్‌ 10లో ట్రెండ్‌ అవుతోంది. ఏదో మన దేశంలో మాత్రమే అనుకునేరు.. కానే కాదు.. ఏకంగా 36 దేశాల్లో వంద రోజులుగా టాప్‌ 10లో ట్రెండింగ్‌ అవుతోంది.. అంతలా క్లిక్‌ అయిన వెబ్‌ సిరీస్‌ మనదే.. ఇంతకీ అదె అనుకుంటున్నారా?

ద రైల్వే మ్యాన్‌. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తయిన భోపాల్‌ గ్యాస్‌ లీక్‌ ఘటన ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించారు. ఆర్‌ మాధవన్‌, కేకే మీనన్‌, దివ్యేందు, బాబిల్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ్‌ రావలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ గతేడాది నవంబర్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాకు విపరీత ఆదరణ దక్కడంతో సిరీస్‌ మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్‌ సిరీస్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్‌ రావడం నిజంగా గ్రేట్‌ అంటున్నారు వెబ్‌ వీక్షకులు.

చదవండి: చివరి రోజు షూటింగ్‌.. అమ్మ ఇక లేదంటూ ఫోన్‌ కాల్‌.. నిర్మాతకు చెప్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement