
తమిళసినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈమె నటిగానే కాకుండా, ప్రేమలోనూ, బ్రేకప్స్‌లోనూ, సహజీవనంలోనూ, పెళ్లి విషయంలోనూ, చివరికి తల్లి కావడంలోనూ సంచలనమే. అసలు వీటన్నింటినీ గమనిస్తే.. నయనతార ముందు పుట్టి ఆ తర్వాత సంచలనం అనే పదం పుట్టిందేమో అనిపిస్తోంది.
మొదట్లో గ్లామర్‌తో తన సినీ పయనాన్ని పదిలం చేసుకున్న ఈమె ఆ తర్వాత నటనతో అందలం ఎక్కిందని చెప్పవచ్చు. ప్రస్తుతం లేడీ సపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ కథల్లోనే నటిస్తోంది. మధ్య మధ్యలో హీరోలతోన జతకడుతూ ఆ వర్గం ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. ఆ మధ్య తెలుగులో చిరంజీవితో కలిసి నటించిన గాడ్ ఫాదర్ ఈమెకు మంచి పేరే తెచ్చిపెట్టింది.
కాగా నయనతార సెంట్రిక్ పాత్రలో నటించిన కనెక్ట్, అలాగే జయంరవితో జత కట్టిన ఇరైవన్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం తొలి బాలీవుడ్ చిత్రం జవాన్‌లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ కథానాయకుడు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షటింగ్ తుది దశకు చేరుకుంది. దీంతో ఈమె మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. శశికాంత్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నటుడు వధవన్‌కు జంటగా నటించడానికి నయనతార ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో నటుడు సిద్ధార్థ్ కూడా ముఖ్య పాత్రను పోషించనున్నట్లు తెలిసింది.. అయితే ఈ చిత్రానికి సంబంధింన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.