ముంబై: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా జాతీయ నటుడు ఆర్ మాధవన్‌ను నియమించుకుంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు ప్రముఖ నటి కీర్తి సురేశ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు నటులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు.
దేశ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులు సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తారని గ్రూప్ చైర్మన్ జోస్ అలుకాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బ్రాండ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మాధవన్ అన్నారు. ఆధునిక ప్రపంచంలో ఆభరణాల పట్ల పెరుగుతున్న మహిళల అభిరుచులను జోస్ అలుకాస్ తీర్చిందని నటి కీర్తి సురేష్ తెలిపారు.
ఇదీ చదవండి: UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్‌పీసీఐ వివరణ
Comments
Please login to add a commentAdd a comment