Jos alukkas
-
25 కేజీల బంగారం దొంగతనం.. ఎక్కడంటే?
ప్రముఖ బంగారం స్టోర్ నుంచి గ్రాముల్లో కాదు ఏకంగా కేజీల్లో బంగారాన్ని దోచేసిన సంఘటన మంగళవారం తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కోయంబత్తూరులోని జోస్ అలుక్కాస్ సంస్థకు చెందిన గాంధీపురం బ్రాంచ్‌లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో వారు ఏకంగా 25 కేజీల బంగారు ఆభరణాలను దోచేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి షాపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం ఎప్పటిలాగే షాపు మూసిన ఉద్యోగులు తెల్లవారిన తర్వాత షోరూమ్ తెరిచి చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. షోరూమ్ వెనుకవైపు దొంగలు ఏసీ వెంటిలేటర్ ద్వారా స్టోర్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దాంతో వెంటనే కంపెనీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. VIDEO | Gold ornaments weighing up to 25 kg looted from Jos Alukkas & Sons in Gandhipuram, Coimbatore. Police are at the spot and investigating the matter. More details are awaited. pic.twitter.com/J1z19L9XFp — Press Trust of India (@PTI_News) November 28, 2023 ప్రస్తుతం కోయంబత్తూరు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దొంగలించబడిన బంగారం విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 200 సవర్ల బంగారం మాయం కావటంపై పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. జోస్‌అలుక్కాస్‌ను 1964లో అలుక్కా వర్గీస్ స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ స్టోర్లున్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5500 కోట్లతో 100 స్టోర్లు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీకి ఏటా దాదాపు రూ.9000 కోట్ల రెవెన్యూ ఉందని సమాచారం. Approximately 150-200 sovereigns of gold jewellery robbed at Jos Alukkas showroom in Coimbatore in the early hours today. The police have formed five special teams to nab the accused. As per CCTV visuals, only one person is seen inside the store during the scene. @IndianExpress pic.twitter.com/nVyvKjpidp — Janardhan Koushik (@koushiktweets) November 28, 2023 -
హైదరాబాద్‌లో.. సినీనటి 'పాయల్ రాజ్‌పుత్' సందడి!
సాక్షి, హైదరాబాద్: హఫీజ్‌పేట్ డివిజన్ మదీనాగూడలో సినీనటి పాయల్ రాజ్‌పుత్ శుక్రవారం సందడి చేసింది. హైదరాబాద్‌లో జోస్ అలుక్కాస్ 4వ నూతన షోరూంను ఆమె సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె ఆలుక్కా, జాన్ ఆలుక్కాలతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోస్ అలుక్కాస్‌లో ఆభరణాలన్నీ నాణ్యతో కూడి అందంగా ఉన్నాయన్నారు. శుభమాంగళ్యం బ్రైడల్ కలెక్షన్స్, ఫెస్టివల్ ఎడిషన్, పరంపర కలెక్షన్స్, ఐవీ కలెక్షన్స్ లాంటివి జోస్ ఆలుక్కాస్ ప్రత్యేక బ్రాండ్స్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
'సీజన్ ఆఫ్ లవ్' అవార్డు సొంతం చేసుకున్న జోస్ ఆలుక్కాస్
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా ''సీజన్ ఆఫ్ లవ్'' అవార్డు అభించింది. జాతీయ స్థాయిలో అత్యంత ఆమోదనీయమైన సముదాయంగా ఆవిర్భవిస్తున్న స్టోర్ల విభాగంలో సంస్థకు ఈ అవార్డు దక్కింది. ‘‘మేలిరకం ప్లాటినం ఆభరణాలను నిల్వ చేయడమే కాకుండా, అసాధారణమైన షాపింగ్ అనుభవాన్ని అందించినందుకు ఇది తగిన గుర్తింపు’’ అని కంపెనీ తెలిపింది. -
జోస్ ఆలుక్కాస్.. హెచ్‌యూఐడీ ‘ఫెస్ట్’
హైదరాబాద్: దక్షిణ భారత్‌లో ప్రముఖ జ్యువెల్లరీ గ్రూప్‌ల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్, హెచ్‌యూఐడీ హాల్‌మార్కింగ్ అమలును వేగవంతం చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు హెచ్‌యూఐడీ ఎక్స్ఛేంజ్ ఫెస్ట్ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్ బీఐఎస్-916 హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను ప్రవేశపెట్టి, విక్రయించిన మొదటి జ్యువెల్లరీ గ్రూప్‌గా నిలిచిన సంస్థ, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ (హెచ్‌యూఐడీ)తో తన బంగారు నిల్వల్లో మొత్తం 100 శాతాన్ని హాల్‌మార్క్ చేసినట్లు పేర్కొంది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) మరిన్ని వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
జోస్ అలుకాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాధవన్
ముంబై: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ అలుకాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా జాతీయ నటుడు ఆర్ మాధవన్‌ను నియమించుకుంది. ఇప్పటికే ఈ బ్రాండ్‌కు ప్రముఖ నటి కీర్తి సురేశ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇరు నటులు అంగీకార పత్రంపై సంతకాలు చేశారు. దేశ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తులు సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేస్తారని గ్రూప్ చైర్మన్ జోస్ అలుకాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బ్రాండ్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని మాధవన్ అన్నారు. ఆధునిక ప్రపంచంలో ఆభరణాల పట్ల పెరుగుతున్న మహిళల అభిరుచులను జోస్ అలుకాస్ తీర్చిందని నటి కీర్తి సురేష్ తెలిపారు. ఇదీ చదవండి: UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ -
Jos Alukkas Jewellery Store: యూట్యూబ్‌లో చూసి రూ.10 కోట్ల విలువైన బంగారం దోపిడీ!
చెన్నై: వెల్లూరులోని ఓ నగల దుకాణంలో వారంరోజుల క్రితం గోడకు కన్నం వేసి 15 కిలోల బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే! ఐతే ఈ దోపిడీకి పాల్పడిన నిందితుడిని తమిళనాడు పోలీసులు అనతికాలంలోనే అరెస్ట్ చేశారు. ఐదు రోజుల పాటు ముమ్మర గాలింపులు చేసిన పోలీసులు నిందితుడి పట్టుకుని, అతని వద్ద బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. కొసమెరుపేంటంటే... యూట్యూబ్ వీడియోలు చూసి దోచుకోవడం ఎలాగో నేర్చుకుని పక్కాప్లాన్‌తో పనికానించాడీ ఈ ఘరానా దొంగ. డిసెంబర్ 15న జోస్ ఆలుక్కాస్ జ్యువెలరీ షాపు గోడ పగులగొట్టి, లోపలున్న15 కిలోల బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లారు. ఐతే సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సింహం ముసుగు ధరించి, స్ప్రే పెయింట్‌తో సీసీటీవీ కెమెరాల రికార్డింగ్‌ను ఆపేందుకు ప్రయత్నించినట్లు కనిపించింది. ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసులకు మాత్రం అనేక అనుమానాలు తలెత్తాయి. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడే అందుకు కారణం. దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన 8 పోలీస్ టీమ్‌లు ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలించి సోమవారం నాడు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు కూచిపాళయం గ్రామానికి చెందిన టిఖారాం (22)గా గుర్తించారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి దోపిడీకి ప్లాన్ చేసినట్లు, జ్యువెలరీ షాపు గోడకు రంధ్రం చేసి, శబ్దం రాకుండా షాపులోకి ప్రవేశించేందుకు10 రోజులపాటు ప్రాక్టీస్చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే సీసీటీవీని ఎలా బ్లాక్ చేయాలో కూడా యూట్యూబ్‌లోనే నేర్చుకున్నాడట. వీలైనంత త్వరగా సంపన్నుడు కావాలని ఇంతటి పన్నాగంపన్నిన టిఖారాం అనూహ్యంగా పోలీసుల వలలో చిక్కుకోవడంతో గుట్టురట్టయ్యింది. అతని వద్ద నుంచి దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనంచేసుకుని, ఐపీసీ 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు. -
ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్..!
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్ సేవలు దీర్ఘకాలం కొనసాగాలని సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన వివరించింది. జోస్ ఆలుక్కాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమి తులుకావడం గర్వకారణమని కీర్తి పేర్కొంది. -
జోస్ అలుక్కాస్‌లో రంజాన్ స్పెషల్ ఆఫర్
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జోస్ అలుక్కాస్ ప్రత్యేక ఆఫర్లు ప్రారంభించిందని సంస్థ చైర్మన్ జోస్ అలుక్కా ఒక ప్రకటనలో తెలిపారు. విస్తృత శ్రేణిలో సరికొత్త స్వచ్ఛమైన బంగారు ఆభరణాల కలెక్షన్స్ వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రతి కొనుగోలుపై తప్పనిసరిగా బహుమతులుంటాయని.. మీ పాత 22 క్యారెట్ ఆభరణాలను ఎక్ఛ్సేంజ్ చేసుకోవచ్చని తెలిపారు. 916 బీఐఎస్ హాల్‌మార్క్ బంగారం, ఐజీఐ సర్టిఫైడ్ వజ్రాభరణాలకు మార్చుకోవచ్చన్నారు. బంగారు ఆభరణాల అడ్వాన్స్ బుకింగ్‌పై అద్భుత ప్రయోజనాలు పొందాలని సూచించారు. ప్రత్యేక రంజాన్ కలెక్షన్లో భాగంగా రూ.1.48,000 నుంచి ప్రారంభమయ్యే డైమండ్ నెక్లెస్ సెట్లు అమ్మకానికి పెట్టామన్నారు. వజ్రాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని సూచించారు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటుచేశామన్నారు. ఈ ఆఫర్లు జూన్ 26 వరకు వర్తిస్తాయన్నారు. -
జోస్ ఆలుక్కాస్లో గోల్డ్ ఎక్చ్సేంజ్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ సంస్థ ‘జోస్ ఆలుక్కాస్’ తాజాగా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ‘గోల్డ్ ఎక్చ్సేంజ్’ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు పాత 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను సరికొత్త డిజైన్లలోని 916 బీఐఎస్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలకు, ఐజీఐ ధ్రువీకృత వజ్రాభరణాలకు మార్పిడి చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన 20 శాతం తగ్గింపు పొందొచ్చని పేర్కొంది. నెఫ్ట్, ఆర్టీజీఎస్, చెక్కు, డెబిట్/క్రెటిడ్ కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చని తెలిపింది. అన్ని జోస్ ఆలుక్కాస్ షోరూమ్‌లలో అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొంది. -
కొత్తగా జోయ్ ఆలుక్కాస్ దుబాయ్ షోరూమ్
హైదరాబాద్: జోయ్ ఆలుక్కాస్ సంస్థ పూర్తిగా నవీకరించిన దుబాయ్ షోరూమ్, దెయిరాను పునఃప్రారంభించింది. షోకేస్ ఫ్లోర్‌ను మరింతగా విస్తరించామని, డిస్ప్లే ఏరియాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని జోయ్ ఆలుక్కాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను తమ గ్రూప్ ఈడీ జాన్ పాల్ అలుక్కాస్ ప్రారంభించారని పేర్కొంది. ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినమ్ల్లో పది లక్షలకు పైగా వినూత్నమైన డిజైన్లలలో అభరణాలు లభ్యమవుతాయని ఈ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా జాన్ పాల్ ఆలుక్కాస్ పేర్కొన్నారు. ధర, ఎంపిక, సౌకర్యం, సేవలకు సంబంధించి వినియోగదారులకు ఉత్తమమైన ఆఫర్లనందించడమే తమ లక్ష్యమని జోయ్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ, జాయ్ ఆలుక్కాస్ తెలిపారు. 11 దేశాల్లో 120కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్
హైదరాబాద్: జోస్ ఆలుక్కాస్లో ఎన్నారై ఫెస్ట్ ప్రారంభమైంది. ప్రవాస భారతీయులకు స్వాగతం పలికేందుకు తమ షోరూమ్‌లలో బంగారు, వజ్రాభరణాల్లో సరికొత్త కలెక్షన్ అందుబాటులో ఉందని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపిం ది. ప్రతి కొనుగోలుపై బహుమతులు, వజ్రాభరణాల కొనుగోళ్లపై డిస్కౌంట్, పాత బంగారాన్ని కొత్త బంగారు ఆభరణాలతో ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం తదితర పలు ఆఫర్లున్నాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. -
జోస్ ఆలుక్కాస్ ఆఫర్లు..
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ తాజాగా వినియోగదారులకు వజ్రాభరణాల కొనుగోలుపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. రూ.50,000 ధర కలిగిన వజ్రాభరణాల కొనుగోలుపై ఒక బంగారు నాణేమును, రూ.1,00,000 విలువైన వజ్రాభరణాల కొనుగోలుపై ఒక డైమండ్ పెండెంట్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే రూ.5,000 నుంచి ప్రారంభమయ్యే వజ్రాభరణాల శ్రేణి.. అంతర్జాతీయ ల్యాబ్ సర్టిఫికేషన్, తిరిగి కొనుగోలు హామీతో లభిస్తాయని జోస్ ఆలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోస్ ఆలుక్కా పేర్కొన్నారు. -
రాజమండ్రిలో జోస్ ఆలుక్కాస్ షోరూమ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ఏపీలో మరో కొత్త జ్యువెల్లరీ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆగస్ట్-15న కొత్తగా రాజమండ్రిలో జ్యువెల్లరీ షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్లు జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌లో వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రారంభోత్సవ ఆఫర్లు ఉంటాయనిసంస్థ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు. అలాగే ఈ షోరూమ్‌లో వినియోగదారులకు పలు రకాల గోల్డ్ స్కీమ్స్, విస్తృత శ్రేణి ఆభరణాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.