త్రిస్సూర్: భారత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా ప్రముఖ జ్యువెలరీ సంస్థ జోస్ ఆలుక్కాస్ ముందడుగు వేసింది. చైర్మన్ జోస్ ఆలుక్కా 80వ పుట్టినరోజు సందర్భంగా త్రిస్సూర్ జూబ్లీ మిషన్ హాస్పిటల్ భాగస్వామ్యంతో ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోటి రూపాయల ఈ సంచార వైద్య కేంద్రాన్ని ప్రముఖ నటి మంజు వారియర్ ప్రారంభించారు.
ఇందులో ఈసీజీ, మల్టీ పారా మోనిటర్లు, మినీ ల్యాబ్ ఉన్నాయి. ఒకేసారి ఆరుగురు రోగులకు చికిత్స చేయవచ్చు. ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం, అధునాతన వైద్యాన్ని మారుమూల ప్రజలకు చేర్చడమే ‘హాస్పిటల్ ఆన్ వీల్స్’ ముఖ్య లక్ష్యమని జోస్ ఆలుక్కా తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎండీలు వర్ఘీస్ ఆలుక్కాస్, పాల్ జె ఆలుక్కాస్, జాన్ ఆలుక్కాస్, జూబ్లీ మిషన్ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ సింటో కరేపరంబన్, సీఈవో డాక్టర్ బెన్నీ జోసెఫ్ నీలంకవిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment