కొత్తగా జోయ్ ఆలుక్కాస్ దుబాయ్ షోరూమ్ | Oman- Joyalukkas Gold Centre, Deira, reopens with a new look | Sakshi
Sakshi News home page

కొత్తగా జోయ్ ఆలుక్కాస్ దుబాయ్ షోరూమ్

Published Tue, Jul 5 2016 12:53 AM | Last Updated on Sat, Sep 29 2018 5:41 PM

కొత్తగా జోయ్ ఆలుక్కాస్ దుబాయ్ షోరూమ్ - Sakshi

కొత్తగా జోయ్ ఆలుక్కాస్ దుబాయ్ షోరూమ్

హైదరాబాద్: జోయ్ ఆలుక్కాస్ సంస్థ పూర్తిగా నవీకరించిన దుబాయ్ షోరూమ్, దెయిరాను పునఃప్రారంభించింది. షోకేస్ ఫ్లోర్‌ను మరింతగా విస్తరించామని, డిస్‌ప్లే ఏరియాలను మరింత సుందరంగా తీర్చిదిద్దామని  జోయ్ ఆలుక్కాస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌ను తమ గ్రూప్ ఈడీ జాన్ పాల్ అలుక్కాస్ ప్రారంభించారని పేర్కొంది. ఈ షోరూమ్‌లో బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినమ్‌ల్లో పది లక్షలకు పైగా వినూత్నమైన డిజైన్లలలో అభరణాలు లభ్యమవుతాయని ఈ షోరూమ్ పునఃప్రారంభం సందర్భంగా జాన్ పాల్ ఆలుక్కాస్ పేర్కొన్నారు.  ధర, ఎంపిక, సౌకర్యం, సేవలకు సంబంధించి వినియోగదారులకు ఉత్తమమైన ఆఫర్లనందించడమే తమ లక్ష్యమని  జోయ్ ఆలుక్కాస్ గ్రూప్  చైర్మన్, ఎండీ, జాయ్ ఆలుక్కాస్ తెలిపారు. 11 దేశాల్లో 120కు పైగా షోరూమ్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement