R Madhavan: Tweet About RRR Movie, Ram Charan and Jr NTR VIral- Sakshi
Sakshi News home page

R Madhavan: వారిని అలా చూస్తుంటే అసూయ కలుగుతోంది

Published Wed, Jan 5 2022 10:43 AM | Last Updated on Wed, Jan 5 2022 12:47 PM

R Madhavan Tweet About RRR Movie, Ram Charan and Jr NTR - Sakshi

R Madhavan Says He Is Jealous of Ram Charan and Jr NTR: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌( రౌద్రం.. రణం.. రుధిరం). సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ ఒమిక్రాన్‌, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ వాయిదా పడటంతో ప్రేక్షకులు, అభిమానులంతా మూవీ టీంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ  ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. ముఖ్యంగా మాస్‌ అంతిమ్‌ నాటు నాటు పాటకు వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు.

చదవండి: Sanjjanaa Galrani: విడాకులు తీసుకోబోతున్న హీరోయిన్‌!, క్లారిటీ ఇచ్చిన సంజన

దీని క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఇందులో రామ్‌ చరణ్‌, జూ. ఎన్టీఆర్‌ స్టెప్పులకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక పాటలో అందరికి చరణ్‌, తారక్‌ల బాండింగ్‌ చూడముచ్చటగా అనిపిస్తే ఓ స్టార్‌ హీరోకు మాత్రం అసూయ పుట్టిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. ఈ పాటలో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను చూసి తనకు అసూయ కలిగిందంటూ ప్రముఖ నటుడు ఆర్‌ మాధవన్‌ సోషల్‌ మీడియాలో వ్యక్తం చేశాడు. నాటు నాటు పాటలో చరణ్‌, తారక్‌ వేసిన స్టెప్పుల వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. ‘ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. ఇందులో వారిద్దరి స్నేహం.. సమన్వయం నాలో ఈర్ష్య పుట్టేలా చేస్తున్నాయి.

చదవండి: Radhe Shyam: ఊహించిందే నిజమైందా? దీని అర్థమేంటి డైరెక్టర్‌ గారూ..

వారిద్దరిని అలా చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది. అయిన మీరిద్దరి పట్ల గర్వంగా ఉంది. హ్యాట్సాఫ్’ అంటూ ట్వీట్‌ చేశాడు మ్యాడీ. మాధవన్‌ ట్వీట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం స్పందిస్తూ ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. ఆ తర్వాత మధవన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ టీంను ఉద్దేశిస్తూ..  ‘భారత్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్లను మీరు తిరిగి రాయబోతున్నారు’అంటూ మరో ట్వీట్‌ చేశారు. వెంటనే ‘మేము సిద్ధంగా ఉన్నాం. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం సర్. దేశంలోని థియేటర్ సమస్యలను అతి త్వరలో అధిగమిస్తామని ఆశిస్తున్నాము’ అంటూ మాధవన్‌ ట్వీట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీం స్పందించింది. కాగా ఈ సినిమాలో తారక్‌ కొమురం భీంగా, రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement