మహిళ గర్భంలో పిండమా? కారా? | Woman's ultrasound shows she is having a baby 'car' | Sakshi
Sakshi News home page

మహిళ గర్భంలో పిండమా? కారా?

Published Wed, Jun 15 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

మహిళ గర్భంలో పిండమా? కారా?

మహిళ గర్భంలో పిండమా? కారా?


శాన్ ఫ్రాన్సిస్కో: భార్య కడుపులో బిడ్డకు బదులు చిన్న కారు ఉందని తెలిస్తే.. అదీ  రకరకల కార్లంటే పడి చచ్చే పురుషుడికి తన భార్య గర్భంలో పిండానికి బదులు ఒక స్పోర్ట్స్ కారు కనిపిస్తే...వినడానికి వింతగా ఉంది  కదూ. కానీ  అమెరికాకు చెందిన సోషల్ మీడియా రెడ్ ఇట్ అనే వెబ్ సైట్ లో ఒక వ్యక్తి ఇలాంటి అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.  24  వారాల  తన భార్య  గర్భంలో శిశువుకు బదులు ఒక  బేబీ కార్ కనిపించిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన అల్ట్రాసౌండ్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

తమ దంపతులకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) ద్వారా ఇప్పటికే ఆరు నెలల పాప ఉందని,  దీంతో  ఇప్పట్లో పిల్లలు కావాలని అనుకోలేదని తెలిపాడు. అయితే అద్భుతమైన రీతిలో సహజంగానే తన భార్య మళ్లీ  గర్భం దాల్చిందని రాశాడు.  ఈ క్రమంలో ఆమెకు  స్కానింగ్  రిపోర్టు ఫోటోలో  చిన్న కారు కనిపించడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. దీంతో ఆ ఫోటో..ఆకథనం వైరల్ గా మారింది.  నెటిజన్లు దీనపై భిన్న మైన కమెంట్లు చేశారు. ఆటోమొబైల్ జోక్స్ పేల్చారు.  ఆ కుటుంబంలోకి ది  ఫాస్ట్ అండ్ ది ఫీటస్ వస్తోందని ఒకరు.. ది ఆల్ న్యూ ఫోర్ట్ ఫీటస్ అని మరొకరు.. న్యూ ఎడిషన్ కారు కోసం ఆల్ ది బెస్ట్ ... దె హావ్ ఎ స్మూత్ రైడ్..ఇలా  రకరకాల  కామెంట్ల వెల్లువ హోరెత్తుతోంది. అయితే దీనిపై అటు నిపుణుల నుంచిగానీ.. ఇటు డాక్టర్ల వైపు నుంచి ఎలాంటి  స్పందనా రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement