పచ్చబొట్టేసిన అభిమానం | Over 1,000 people tattoo Jayalalithaa's picture, name | Sakshi
Sakshi News home page

పచ్చబొట్టేసిన అభిమానం

Published Wed, Feb 24 2016 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

పచ్చబొట్టేసిన అభిమానం

పచ్చబొట్టేసిన అభిమానం

అమ్మపై అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు తమిళనాడు వాసులు. అన్నాడీఎంకే అధినేత్రి... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ పుట్టినరోజు తమకు చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో సుమారు వెయ్యిమంది తమ చేతులపై ఆమె చిత్రాన్ని, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకొని ప్రత్యేకాభిమానం చాటారు.

జయలలిత పుట్టినరోజు వారోత్సవాలు మంగళవారం మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా ప్రజలు ఆమెపై ప్రత్యేక అభిమానం చూపించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా  వేలచ్చేరి ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సహా వేలమంది జనం క్యూకట్టి మరీ తమ చేతులపై టాటూలు వేయించుకున్నారు.

అమ్మకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలంటే ఇదో మంచి అవకాశం అని, అందులో భాగంగా వచ్చిన ఆలోచనే పచ్చబొట్టు కార్యక్రమానికి నాంది పలికిందని అశోక్ తెలిపారు. సుమారు 600 మంది కార్యక్రమంలో పాల్గొంటారని భావించామని, అయితే వేలకొద్దీ జనంతోపాటు సీనియర్ మంత్రి పన్నీర్ సెల్వం కూడా వచ్చి అమ్మ టాటూ వేయించుకునేందుకు ఆసక్తి చూపించడం ఆనందం కలిగించిందన్నారు. వలంటీర్లు కూడా స్వచ్ఛందంగా  తమ చేతులపై తమిళంలో అమ్మ అని, జయలలిత చిత్రాలను.. పచ్చబొట్టుగా వేసుకున్నారని అశోక్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement