tattooed
-
సినిమా తరహా ఘటన.. హంతకుల పేర్లు పచ్చబొట్టు
ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్ పలుమార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్మారే గర్ల్ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్లను ఉపయోగించి వాఘ్మారేను హత్య చేశారు.వాఘ్మారే గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
పచ్చబొట్టేసిన అభిమానం
అమ్మపై అభిమానాన్ని మరోసారి ప్రదర్శించారు తమిళనాడు వాసులు. అన్నాడీఎంకే అధినేత్రి... తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 68వ పుట్టినరోజు తమకు చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో సుమారు వెయ్యిమంది తమ చేతులపై ఆమె చిత్రాన్ని, 'అమ్మ' అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకొని ప్రత్యేకాభిమానం చాటారు. జయలలిత పుట్టినరోజు వారోత్సవాలు మంగళవారం మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా ప్రజలు ఆమెపై ప్రత్యేక అభిమానం చూపించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా వేలచ్చేరి ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సహా వేలమంది జనం క్యూకట్టి మరీ తమ చేతులపై టాటూలు వేయించుకున్నారు. అమ్మకు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలంటే ఇదో మంచి అవకాశం అని, అందులో భాగంగా వచ్చిన ఆలోచనే పచ్చబొట్టు కార్యక్రమానికి నాంది పలికిందని అశోక్ తెలిపారు. సుమారు 600 మంది కార్యక్రమంలో పాల్గొంటారని భావించామని, అయితే వేలకొద్దీ జనంతోపాటు సీనియర్ మంత్రి పన్నీర్ సెల్వం కూడా వచ్చి అమ్మ టాటూ వేయించుకునేందుకు ఆసక్తి చూపించడం ఆనందం కలిగించిందన్నారు. వలంటీర్లు కూడా స్వచ్ఛందంగా తమ చేతులపై తమిళంలో అమ్మ అని, జయలలిత చిత్రాలను.. పచ్చబొట్టుగా వేసుకున్నారని అశోక్ తెలిపారు. -
ఎవరి సరదా వాళ్లది
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు... అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ జేడ్ హెర్రిక్దో వింత పిచ్చి. పచ్చబొట్లు (టాటూ) అంటే చాలామందికి సరదా, కొందరికి ఇష్టం. కానీ హెర్రిక్కు మాత్రం ప్రాణం. 29 ఏళ్ల ఈ క్రికెటర్ చిన్నప్పటి నుంచి తాను ఇష్టపడ్డ కార్టూన్లు, యానిమేటెడ్ సినిమాలను టాటూల రూపంలో ఒళ్లంతా పొడిపించుకున్నాడు. దీనికోసం ఇప్పటిదాకా రూ.12 లక్షలపైనే ఖర్చు చేశాడు. టాటూల కోసం ఇంత ఖర్చు చేస్తావా అని అడిగితే... ‘నేను ఎక్కువగా మందు తాగను. పార్టీల కోసం డబ్బులు తగలేయను. దుబారా ఖర్చు చేయను. ఇవంటే ఇష్టం కాబట్టి ఖర్చుపెడతా’ అంటున్నాడు. సరే ఆయన శరీరం, ఆయనిష్టం. కానీ ఈ టాటూలను అందరికీ చూపించి ముచ్చట పడిపో తాడు. తన పచ్చబొట్లు అన్నీ అందరికీ చూపించేందుకు గాను నగ్నంగా ఫొటోలు దిగి సంచలనం సృష్టించాడు. దీంతో అసలుకే మోసం వచ్చింది. తను నగ్నంగా ఫొటోలు దిగిన తర్వాత చాలామంది హెర్రిక్తో మాట్లాడటానికి ఇష్ట పడటం లేదట. కానీ తనతో మాట్లాడితే తానెంత మంచివాడినో తెలుస్తుంది అంటున్నాడు... బిగ్‌బాష్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ఆడే హెర్రిక్.