
వైఎస్సార్‌సీపీ జెండాలతో.. అశేష జన వాహిని నడుమ సీఎం జగన్ నినాదాలతో గత మూడు సిద్ధం సభలు హోరెత్తడం చూశాం. ఇక ఆఖరి సిద్ధం సభ అంతకు మించి ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం నాడు బాపట్ల అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ సిద్ధం సభ జరగబోతోంది.
గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెబుతూనే.. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తామో సీఎం జగన్ ఈ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అలాగే.. ఎన్నికలకు ఈ వేదిక నుంచే సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ నెట్టింట పలువురిని ఆకట్టుకుంటున్నాయి..