
విమానాల రాకపోకలకు పక్షులు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దీంతో తూర్పు నౌకాదళంలోని వైమానిక బృందం వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్‌డేగా పక్కపక్కనే ఉన్నాయి. వీటి పక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడ నుంచి పక్షులు రాకపోకలు పెరుగుతుండటంతో.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రే డ్రోన్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐఎన్‌ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరనీయకుండా నియంత్రించనున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేస్తే.. రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలమనీ.. తద్వారా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడదని తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment