రోహింగ్యా ముస్లింలపై డ్రోన్‌ దాడి.. 200 మంది మృతి? | Rohingya Muslim Killed by Drone Attack | Sakshi
Sakshi News home page

రోహింగ్యా ముస్లింలపై డ్రోన్‌ దాడి.. 200 మంది మృతి?

Published Sun, Aug 11 2024 9:49 AM | Last Updated on Sun, Aug 11 2024 11:42 AM

Rohingya Muslim Killed by Drone Attack

బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు అదుపులోకి రావడం లేదు. ఇప్పుడు ఆ దేశం ముందు మరో సవాలు నిలిచింది. తాజాగా మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో మయన్మార్ నుండి బంగ్లాదేశ్‌కు తరలివస్తున్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ దాడిలో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.. మృతుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ ఉదంతం సంచలనంగా మారింది. బురదతో కూడిన పొలంలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పడి ఉండడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ మృతదేహాల చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు పడి ఉన్నాయి.

వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ డ్రోన్ దాడుల గురించి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్‌ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబాలపై ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ దాడి రోహింగ్యా పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడి. ఈ దాడుల వెనుక అరకాన్ ఆర్మీ హస్తం ఉందని రాయటర్స్‌ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అరకాన్ ఆర్మీ ఖండించింది. ఈ దాడిపై మయన్మార్ సైన్యం, మిలీషియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో  ఏ ప్రాంతానికి చెందనది? ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే వివరాలు ఇంకా నిర్ధారణ కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement