భవిష్యత్తు యుద్ధాలు వాటితోనే: మస్క్‌ ఆసక్తికర ట్వీట్‌ | Elon Musk Tweet On Drone Wars In Future, Check His Tweet Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు యుద్ధాలు వాటితోనే: మస్క్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Tue, Nov 26 2024 10:58 AM | Last Updated on Tue, Nov 26 2024 11:36 AM

Elon Musk Tweet On Drone Wars In Future

వాషింగ్టన్‌: భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరుపై ప్రముఖ బిలియనీర్‌, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్‌ మస్క్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎఫ్‌-35 వంటి ఆధునిక ఫైటర్‌ జెట్‌ల కంటే డ్రోన్‌ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో మస్క్‌ ఒక పోస్ట్‌ చేశారు.భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్‌లతోనే జరుగుతాయన్నారు.

యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్‌ జెట్‌లు పైలట్‌లను చంపేస్తున్నప్పటికీ కొంతమంది ఎఫ్‌-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారుచేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్‌ తెలిపారు. 

కాగా,ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధవిమానాలు. వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు,రాడార్‌ కంటపడకుండా ఉండే స్టెల్త్‌ వ్యవస్థలు ఉన్నాయి.అయితే వీటి ఖర్చు,నిర్వహణ భారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లపై మస్క్‌ ట్వీట్‌ చర్చనీయాంశమవుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement