wars
-
కోట్లాది మంది ఊచకోత.. ఏం జరిగిందో తెలుసుకుంటే..
-
భవిష్యత్తు యుద్ధాలు వాటితోనే: మస్క్ ఆసక్తికర ట్వీట్
వాషింగ్టన్: భవిష్యత్తులో యుద్ధాలు జరిగే తీరుపై ప్రముఖ బిలియనీర్, టెస్లా కార్ల కంపెనీ అధినేత ఇలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎఫ్-35 వంటి ఆధునిక ఫైటర్ జెట్ల కంటే డ్రోన్ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో మస్క్ ఒక పోస్ట్ చేశారు.భవిష్యత్తులో యుద్ధాలన్నీ డ్రోన్లతోనే జరుగుతాయన్నారు.యుద్ధాల్లో మానవ సహిత ఫైటర్ జెట్లు పైలట్లను చంపేస్తున్నప్పటికీ కొంతమంది ఎఫ్-35 వంటి మనుషులు నడిపే యుద్ధ విమానాలను తయారుచేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ యుద్ధ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని మస్క్ తెలిపారు. కాగా,ఎఫ్-35 ఫైటర్ జెట్లు ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధవిమానాలు. వీటిలో అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లు,రాడార్ కంటపడకుండా ఉండే స్టెల్త్ వ్యవస్థలు ఉన్నాయి.అయితే వీటి ఖర్చు,నిర్వహణ భారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్-35 ఫైటర్ జెట్లపై మస్క్ ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.The F-35 design was broken at the requirements level, because it was required to be too many things to too many people. This made it an expensive & complex jack of all trades, master of none. Success was never in the set of possible outcomes.And manned fighter jets are… https://t.co/t6EYLWNegI— Elon Musk (@elonmusk) November 25, 2024 -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
1966 to 1977: ఇందిరమ్మ శకం
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మూడో లోక్‌సభ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ కాలంలోనే దేశం ఇద్దరు ప్రధానులను కోల్పోయింది. రెండు యుద్ధాలనూ చవిచూసింది. నెహ్రూ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి రెండు విడతలతో పోలిస్తే ఎన్నికల నిర్వహణ కాలం మరింత తగ్గి రెండు నెలల్లోనే క్రతువు ముగిసింది. పదేళ్ల పాటు తండ్రి చాటు బిడ్డగా, నెహ్రూ సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ 1959లో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. ఆమె నాయకత్వంలోనే పార్టీ 1962 ఎన్నికలకు వెళ్లింది. అనూహ్య పరిణామాలతో 1966లో ఇందిర ప్రధాని అయ్యారు. ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. సి.రాజగోపాలాచారి సారథ్యంలో కొత్త జాతీయ పార్టీ తెరపైకి వచి్చంది. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు, విశేషాలకు 1962–67 మూడో లోక్‌సభ కాలం వేదికగా నిలిచింది. ఇందిరాగమనం... పదేళ్ల పాలన తర్వాత కూడా దేశంలో బలమైన ప్రతిపక్షమంటూ వేళ్లూనుకోలేదు. ప్రజల మనసుల్లో నెహ్రూ స్థానం చెక్కు చెదరలేదు. 1962 మూడో లోక్‌సభ ఎన్నికల్లో 28 పార్టీలు పోటీ చేశాయి. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ 60 శాతానికి పైగా సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయి. 1957 కంటే కేవలం 10 సీట్లు, ఒక శాతం ఓట్లు తగ్గాయి. సీపీఐకి 29, రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీకి 18 స్థానాలు దక్కాయి. ప్రజా సోషలిస్ట్ పార్టీ 12, భారతీయ జనసంఘ్ 14 స్థానాలను గెలుచుకున్నాయి. 361 స్థానాలతో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టి నెహ్రూ మూడోసారి ప్రధాని అయ్యారు. ముందుచూపుతో కుమార్తె ఇందిరను అప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇందిర తీరు పార్టీలో అన్ని వర్గాలకూ నచ్చలేదు. ఆమె నాయకత్వ పటిమపై అనుమానాలూ రేకేత్తాయి. పలువురు సీనియర్లు బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. పార్టీలో ఇందిర అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. నెహ్రూ ఉన్నంత కాలం సజావుగానే సాగినా 1964 మే 27న గుండెపోటుతో నెహ్రూ హఠాన్మరణం అనూహ్య మార్పులకు దారి తీసింది. గుల్జారీలాల్ నందా తాత్కాలికంగా 13 రోజులు ప్రధానిగా వ్యవహరించాక 1964 జూన్ 9న లాల్‌బహదూర్ శాస్త్రి గద్దెనెక్కారు. ఆయన దురదృష్టవశాత్తూ 1966 జనవరి 11న ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్లో ఆకస్మిక మరణానికి గురయ్యారు. మరోసారి నందా 13 రోజులు తాత్కాలిక ప్రధానిగా ఉన్నాక ఇందిర రంగప్రవేశం చేశారు. 1966 జనవరి 24న దేశ తొలి, ఏకైక మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికామె యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1959లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిర రాజకీయ కెరీర్ మొదలైంది. అదే ఏడాది నెహ్రూతో విభేదించి సి.రాజగోపాలాచారి స్వతంత్ర పార్టీ ఏర్పాటు చేశారు. తమిళనాట కొత్తగా ఏర్పడ్డ ద్రవిడ మున్నేట్ర కజగం 1962 లోక్‌సభ ఎన్నికల్లో (డీఎంకే) 2 శాతం ఓట్లతో ఏడు సీట్లు గెలిచింది. చైనా, పాక్‌తో యుద్ధాలు నెహ్రూ మూడోసారి అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే చైనా దురాక్రమణను ఎదుర్కోవాల్సి వచి్చంది. టిబెట్ బౌద్ధ గురువు దలైలామాకు 1959లో భారత్ ఆశ్రయం కలి్పంచడం దీనికి నేపథ్యమంటారు. చైనా దళాలు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించడం 1962 అక్టోబర్ 20న ఘర్షణ మొదలైంది. నవంబర్ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించింది. 5,000 మంది సైనికులు అసువులు బాయడమో, అదృశ్యమవడమో జరిగింది. శాస్త్రి హయాంలో పాక్ మనతో కయ్యానికి కాలు దువి్వంది. భారత్‌లో అశాంతిని రాజేయడానికి ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించే ప్రయత్నం యుద్ధానికి దారితీసింది. 1965 ఆగస్ట్ 5 నుంచి సెపె్టంబర్ 23 దాకా సాగిన ఈ యుద్ధంలోనూ 4,000 మంది దాకా సైనికులు అమరులయ్యారు. 1966 జనవరి 10న పాక్‌తో తాషె్కంట్ ఒప్పందం కుదిరింది. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అక్కడే శాస్త్రి కన్నుమూసిన తీరు మిస్టరీగానే మిగిలింది. గుండెపోటని వార్తలొచి్చనా అసలు కారణం ఇప్పటికీ వెలుగు చూడలేదు. సిరా చుక్కకు నాంది ఓటేశాక వేలిపై సిరా చుక్క పెట్టే విధానాన్ని 1962 ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. తయారీ కంపెనీ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ ఎన్నో దేశాలకు ఇంకును ఎగుమతి చేసేది. మూడో లోక్‌సభ కాలంలో ముఖ్య పరిణామాలు ► దేశవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాలపై నెహ్రూ దృష్టి ► దేశంలో పలు ప్రాంతాల్లో స్టీల్ ఫ్యాక్టరీల తదితర చర్యల ద్వారా పారిశ్రామికీకరణకు మరింత ఊతం ► నెహ్రూ ఆకస్మిక మృతి, లాల్‌బహదూర్ శాస్త్రి మిస్టరీ మరణం ► భాషా ప్రాతిపదికన 1960లో మహారాష్ట్ర, గుజరాత్‌గా విడిపోయిన బొంబాయి రాష్ట్రం ► ఆహార కొరతకు విరుగుడుగా హరిత విప్లవం మూడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 494) పార్టీ సీట్లు కాంగ్రెస్ 361 సీపీఐ 29 స్వతంత్ర పార్టీ 18 ప్రజా సోషలిస్ట్ పార్టీ 12 భారతీయ జన సంఘ్ 14 ఇతరులు 40 స్వతంత్రులు 20 – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
మంచి మాట: శత్రుత్వంతో శత్రుత్వం పెట్టుకుందాం
ఏ ఒకవ్యక్తిని మాత్రమో... ఏ కొంతమందిని మాత్రమో కాదు, కుటుంబాలకు కుటుంబాలను, ఊళ్లకు ఊళ్లను, రాష్ట్రాలకు రాష్ట్రాలను, దేశాలకు దేశాలను, మొత్తం ప్రపంచాన్ని వేధించేది శత్రుత్వం. ప్రతిమనిషికీ, ప్రపంచానికీ శత్రుత్వం తీరని గాయాల్ని కలిగిస్తూనే ఉంది. జీవితాలకు జీవితాలే శత్రుత్వానికి కాలి బూడిద అయిపోయాయి. శత్రుత్వం అగ్ని అయి అందరికీ అంటుకుంది, అంటుకుంటోంది... ఉన్నంతవరకూ నిప్పు కాలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా శత్రుత్వం మనిషి కడతేరిపోయేంతవరకూ రగులుతూనే ఉంటుంది. అంతేకాదు వ్యక్తులుపోయాక కూడా వాళ్ల వారసులకూ అంటుకుని శత్రుత్వం వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంది. శ్వాస తీసుకుంటున్నట్లుగా మనిషి శత్రుత్వాన్ని కూడా తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తోంది. పుట్టీపుట్టడంతోనే శత్రువును, వ్యాధిని ఎవరైతే పోగొట్టుకోడో అతడు ఎంతటి బలవంతుడైనా నశించిపోతాడని భోజ చరిత్రం చెబుతోంది. అంటే వ్యాధిని, శత్రువును లేదా శత్రుత్వాన్ని ముదరనివ్వకూడదు. సాధ్యమైనంత వేగంగా వాటిని తీర్చేసుకోవాలి. శత్రుత్వం వ్యాధిలాంటిది అని అనడం, అనుకోవడం కాదు శత్రుత్వం వ్యాధికన్నా వినాశకరమైంది అనే సత్యాన్ని మనం తప్పకుండా అవగతం చేసుకోవాలి. కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం మరికొన్ని దేశాలనూ బాధించింది, బాధిస్తోంది... కొన్ని దేశాల మధ్యనున్న శత్రుత్వం వల్ల జరిగిన యుద్ధాల్లో కలిగిన ప్రాణ నష్టాన్ని, సంపద నష్టాన్ని చరిత్ర మనకు తెలియజెబుతూనే ఉంది. శత్రుత్వం కారణంగా దేశ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు, విలవిలలాడిపోతున్నారు...ఇటీవలి కరోనా విలయానికి కూడా కొన్ని దేశాల శత్రుత్వమే కారణం అని కొన్ని పరిశీలనలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. సంస్కృతి పరంగానూ, సంపదపరంగానూ, విద్యపరంగానూ, అభివృద్ధి పరంగానూ ఏర్పడిన శత్రుత్వం ప్రధాన కారణం కాగా మనదేశంలోకి విదేశీ దురాక్రమణదారులు చొరబడి దేశాన్ని కొల్లగొట్టడమూ, ఆక్రమించుకోవడమూ, సామాజిక పరిస్థితిని అల్లకల్లోలం చెయ్యడమూ అందువల్ల మనదేశానికి పెద్ద ఎత్తున నష్టం, కష్టం కలగడమూ చారిత్రికసత్యంగా మనకు తెలిసిందే. కొన్ని శతాబ్దులకాలం మనదేశం పరపాలనపీడనలో దురవస్థలపాలవడానికి శత్రుత్వం ప్రధానమైన కారణం అయింది. ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా శత్రుత్వం కారణంగా ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో దురంతాలకు శత్రుత్వం ఒక్కటే ప్రాతిపదిక అయింది. శత్రుత్వం ఉంటే దురంతమే ఉంటుంది. శత్రుత్వం ప్రేరణకాగా ప్రపంచంలో ఎన్నో ఘోరమైన పరిణామాలు జరిగాయి. శత్రుత్వంవల్ల మనం ఎంత మాత్రమూ క్షేమంగా లేం. శత్రుత్వంవల్ల చాలకాలం క్రితమే మనిషితో మనిషికి ఉండాల్సిన సంబంధం లేకుండాపోయింది. శత్రుత్వం మనిషిని ఆవహించింది అందువల్ల మనం ఎంత మాత్రమూ భద్రంగా లేం. ఈ క్షేత్రవాస్తవాన్ని మనం బుద్ధిలోకి తీసుకోవాలి. మనిషి ప్రగతి, ప్రశాంతతలను, ప్రపంచ ప్రగతి, ప్రశాంతతలను ధ్వంసం చేస్తున్న శత్రుత్వాన్ని తక్షణమే త్యజించాలి. క్షయకరమైన శత్రుత్వం మనిషి లక్షణం కాకూడదు. శత్రుత్వం మనిషి జీవనంలో భాగం కాకూడదు. ‘ఇది నాలుగురోజుల జీవితం ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం’ ఈ భావంతో తెలుగు కవి–గాయకుడు పి.బి. శ్రీనివాస్ ఒక ఉర్దూగజల్ షేర్ రాసి, పలికారు. ఆలోచిద్దాం... మన బతుకుల వర్తమానాన్నీ, భవిష్యత్తునూ ఛిద్రం చేసే శత్రుత్వం మనకు ఎందుకు? ఆలోచిద్దాం... మనం జీవించడానికి శత్రుత్వం అవసరం ఉందా? మనం శత్రుత్వాన్ని సంపూర్ణంగా వదిలేసుకుందాం. అది సాధ్యం కాకపోతే శత్రుత్వంతోనే శత్రుత్వం చేద్దాం. సాటి మనిషికీ, సమాజానికీ కాదు మనిషి శత్రుత్వానికి శత్రువైపోవాలి. మనిషికి శత్రుత్వంలో ఉన్న నిజాయితి, అభినివేశం స్నేహంలో లేకుండా పోయాయి. ఇది విధ్వంసకరమైన స్థితి. ఈ స్థితి మనకు వద్దు. మనిషి తీరు మారాలి. శత్రుత్వం ఇలలో లేకుండా పోవాలి. ఇప్పటికే మనమందరమూ శత్రుత్వం వల్ల ఆవేదన చెందుతున్నాం. ఇకనైనా సంసిద్ధులమై శత్రుత్వంతో శత్రుత్వమూ, స్నేహంతో స్నేహమూ చేస్తూ బతుకుదాం. నిజమైన మనుషులమై మనం మనకూ, ప్రపంచానికీ వీలైనంత మంచి, మేలు చేసుకుందాం. ‘ఇది నాలుగురోజుల జీవితం, ఎందుకు ఎవరితోనైనా శత్రుత్వం? / నీకు శత్రుత్వమే కావాలనుకుంటే చెయ్యి శత్రుత్వంతోనే శత్రుత్వం‘ – రోచిష్మాన్ -
వ్యక్తి విషాదం
యుద్ధాన్ని నేను ద్వేషిస్తాను, అన్ని రూపాల్లోని యుద్ధాన్నీ నేను ద్వేషిస్తాను అంటాడు ఆర్చెమ్ చపేయే. ఈ ఉక్రెయినియన్ రచయిత తనను తాను ‘పసిఫిస్ట్’ అని చెప్పుకొంటాడు. శాంతి కాముకుడు అని ఈ మాటకు విస్తృతార్థం. యుద్ధం, హింస... ఏ కోశానా సమర్థనీయం కావు అనేది ఇలాంటివాళ్ల భావన. పాపులర్ ఫిక్షన్, క్రియేటివ్ నాన్ –ఫిక్షన్ రచనలతో ఆర్చెమ్ ఉక్రెయిన్ లో మంచి ఆదరణ ఉన్న రచయిత. నాలుగుసార్లు ‘బీబీసీ ఉక్రెయిన్ బుక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఫైనలిస్టు. ఫొటోగ్రఫీ, విజువల్ స్టోరీ టెల్లింగ్ మీద కూడా ఈమధ్యే మక్కువ పెంచుకున్నాడు. ఈమధ్యే అంటే ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగకముందు! రాజధాని నగరం కీవ్ మీద బాంబుల మోత మొదలుకాగానే ఆయన చేసిన మొదటి పని – ముందు తన కుటుంబాన్ని అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు తరలించడం! రెండోది – యుద్ధంలో చేరడానికి తన పేరును నమోదు చేసుకోవడం! యుద్ధం మీద ఆర్చెమ్ అభిప్రాయాలు ఏమీ మారలేదు. కానీ అణిచివేత తన మీద మోపిన యుద్ధం కాబట్టి దీన్నుంచి పారిపోలేనంటాడు. ఓలెహ్ సెన్ త్సోవ్ – రచయిత, దర్శకుడు. ‘క్రిమియా’ ఆయన స్వస్థలం. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియాను రష్యా తన అనుబంధంగా మార్చుకున్నప్పుడు చేసిన నిరసనలకు గానూ తీవ్రవాద ఆరోపణల మీద అరెస్టయ్యాడు. ఐదేళ్లు జైల్లో ఉన్నాడు. (బలవంతపు సప్లిమెంట్స్, మెడికేషన్ కలుపుకొని) 145 రోజుల పాటు చేసిన నిరవధిక నిరశనకు గానూ దాదాపు చావు దాకా వెళ్లొచ్చాడు. 2019లో నేరస్థుల బదిలీ ఒప్పందం మీద ఉక్రెయిన్ కు వచ్చాక దాడి నేపథ్యంలో ‘ద సెకండ్ వన్స్ ఆల్సో వర్త్ బయ్యింగ్’ అనే వ్యంగ్య నవల రాశాడు. ఉక్రెయిన్ లో 1990ల నాటి నేరస్థుల గ్యాంగుల నేపథ్యంలో సాగే ‘రైనో’ సినిమా 2020లో విడుదలైంది. దానికి సానుకూల సమీక్షలు వచ్చాయి. అయితే, మళ్లీ యుద్ధం మొదలుకాగానే ప్రాదేశిక భద్రతా దళంలో చేరిపోయాడు. ఇంకా ఈ జాబితాలో స్తానిస్లావ్ అసెయేవ్, క్రిస్టియా వెంగ్రీనియుక్ లాంటి ఉక్రెయిన్ రచయితలూ ఉన్నారు. అమెరికా రచయితలు ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇ.ఇ. కమ్మింగ్స్, టి.ఇ. లారెన్స్, జె.ఆర్.ఆర్. టోల్కీన్ లాంటివాళ్లు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. జె.డి. శాలింజర్ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. జార్జ్ ఆర్వెల్ స్పానిష్ సివిల్ వార్‌లో పాల్గొని గాయపడ్డాడు. తెలుగు కవి, కథకుడు శిష్టా›్ల ఉమామహేశ్వరరావు; మరో రచయిత అంగర వెంకట కృష్ణారావులు కూడా యుద్ధ అనుభవం ఉన్నవారే! అసలు కవిగానో, రచయితగానో ఉండటమే... దానికదే ఒక యుద్ధం కదా! ఈ రచయితలు మనకు గుర్తున్నది వాళ్లు పట్టుకున్న ఆయుధం వల్ల కాదు, వారి రచనల వల్ల! కాకపోతే అది వారికి ఒక అనుభవంగా పనికివచ్చింది. కానీ ఆ ‘అనివార్యత’ ఎంత దుర్మార్గమైనది? రాసుకోగలిగేవాడు రాసుకునే, ఆనందంగా నర్తించే అమ్మాయి నర్తిస్తూ ఉండగలిగే ప్రపంచాన్ని కోరుకోవడం మరీ అంత పెద్ద కోరికా? లేక, ఇంకో తలంలో వీటన్నింటికీ కారణం అవుతున్న ‘ఇంకో’ మనిషి బుద్ధి అంత చిన్నదా? యుద్ధం అనేది ఏ ఒక్క రూపంలోనో ఉండదని అందరికీ తెలుసు. నేరుగా సరిహద్దు యుద్ధాలు చేయకపోయినా, భిన్నరకాల యుద్ధాల్లో ఎందరు తెలుగు కవులు పాల్గొనలేదు! భావజాల పోరాటాలు మాత్రం యుద్ధం కాదా? సమస్య ఏమిటంటే– ఈ యుద్ధాలు గీతకు అటువైపు ఉన్నావా, ఇటువైపు ఉన్నావా అని తేల్చుకునే విపత్కర పరిస్థితిలోకి మనిషిని నెడతాయి. దీనికి స్పందించడం తప్ప ఇంకో మార్గం ఉండదు. అప్పుడు సమూహంగా మాట్లాడటం తప్ప వ్యక్తికి విడిగా చోటుండదు. వ్యక్తి అనేవాడు లేకుండాపోవడం కంటే బౌద్ధిక విషాదం ఏముంటుంది? అవసరాన్ని బట్టి మనిషి వ్యక్తిగానూ, సమూహంగానూ ఉంటాడు. కానీ సరిగ్గా అదే సందర్భంలో గీతకు అటువైపు ఉన్నవాడు కేవలం విడి మనిషిగానే ఉండదలిస్తే! నేటికి సత్యాలుగా కనబడినవి, రేపటికి మబ్బుల్లా కదిలిపోవని ఎవరూ చెప్పలేరు. కానీ యుద్ధాలు, భావజాలాల్లో వర్తమానపు కొలేటరల్ డ్యామేజ్ అనబడే అనివార్య నష్టం లెక్కలోకి రాదు. వీళ్ల వల్ల గాయపడ్డ ఆ ‘ఎదుటి’ మనిషి ఎవరో వీరికి ఎప్పటికీ సంపూర్ణంగా తెలియకపోవచ్చు. నిరసనకారుల గుంపును చెదరగొట్టడానికి పోలీసులు చేసే లాఠీఛార్జీలో రెండు దెబ్బలు తినేవాడి నొప్పి ఎవరికీ పట్టదు. ఏ కోర్టులూ, ఏ ప్రజాసమూహాలూ దీనికి న్యాయం చేయలేవు. కానీ ఒక్కడు మాత్రం తన జీవితకాలం ఆ రెండు దెబ్బల బరువును మోయాల్సి వస్తుంది. ఆ చివరి మనిషి గాయానికి కూడా లేపనం పూయనంతవరకూ, అసలు ఆ మనిషికి గాయం కాని పరిస్థితులు వచ్చేంతవరకూ మనది నాగరిక సమాజం కాబోదు. వేపచెట్టు మీద వాలి కూసేది ఒక కాకి కాదు. అది ‘ఫలానా’ కాకి మాత్రమే అవుతుంది. దాని కూతకు స్పందనగా వచ్చి జతకూడేది కూడా ఇంకో కేవలం కాకి కాదు. అది మరో ఫలానా కాకి అవుతుంది. రెండూ వేర్వేరు కాకులు... ఇద్దరు వేర్వేరు సంపూర్ణ మనుషుల్లా! అవి వాలిన వేపచెట్టుకు కూడా మనం పేరు పెట్టివుండకపోవచ్చుగానీ అది కూడా దానికదే ప్రత్యేక యూనిట్. దానికదే యునీక్. దాన్ని పోలిన చెట్టు, దానిలాగా కొమ్మలను విరుచుకున్న చెట్టు ఇంకోటి ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మన కాళ్లకు తగిలే పిల్లి లాంటిది ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు. కానీ మనుషులే కేవలం సమూహ అస్తిత్వాలకు పరిమితమయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు, ఇంక పక్షులు, జంతువులు, చెట్లూ చేమలను కూడా విడిగా గుర్తించాలంటే మనిషి ఎంత సున్నితం కావాలి! ఎంత సూక్ష్మం కావాలి! -
గుడిలో ‘నాగమ్మ’
సాక్షి, కరీంనగర్: పల్నాటి యుద్ధాలతో ప్రఖ్యాతిగాంచిన నాయకురాలు నాగమ్మ. దాదాపు 900 ఏళ్ల క్రితమే మంత్రిగా పనిచేసి, తెలుగు పౌరుషానికి నిదర్శనంగా నిలిచిన ధీర వనిత. సంక్రాంతి పేరు చెప్పినా, కోడిపందాల ప్రస్తావన వచ్చినా.. తెలుగువారి మదిలో వెంటనే స్ఫురించేది ఆమె పేరే. ఆ వీర వనిత స్వస్థలం తెలంగాణలోని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరవెల్లిలో.. ఆమెకు గుడికట్టి దైవ స్వరూపంగా కొలుస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఆ పురాతన ఆలయాన్ని ఇటీవలే పునర్నిర్మించారు. త్వరలోనే ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో నాయకురాలు నాగమ్మను ఓసారి గుర్తు చేసుకుందాం. బ్రహ్మనాయుడిని ఎదుర్కొని.. నాగమ్మది సంపన్న రైతు కుటుంబం. తండ్రి చౌదరి రామిరెడ్డి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన నాగమ్మకు ఏడేళ్ల వయసు ఉండగా.. జగిత్యాల ప్రాంతంలో మశూచి ప్రబలింది. దానితో పల్నాడులోని మేనమామ జగ్గారెడ్డి ఇంటికి పంపారు. అక్కడే యుద్ధవిద్యలు, సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం సాధించింది. తన మనోధైర్యం, మేధస్సుతో పల్నాడును పాలించే నలగామరాజు కొలువులో మంత్రిగా చేరింది. మహిళలు ఇంట్లోంచి బయటికి కాలు పెట్టని కాలంలోనే.. మంత్రిగా ప్రతిభా పాటవాలు చూపింది. ఆ సమయంలోనే పల్నాడులో జరిగిన యుద్ధాల్లో బ్రహ్మనాయుడుతో తలపడింది. బుద్ధికుశలతను, రాజనీతిజ్ఞతను ప్రదర్శించి.. పొరుగు రాజ్యాల సాయం పొందింది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరగడంతో కలత చెందిన బ్రహ్మనాయుడు తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్లిపోగా.. నాగమ్మ తన జన్మస్థలమైన ఆరవెల్లికి వచ్చింది. అక్కడ స్థానికులను ఇబ్బందిపెడ్తున్న బందిపోట్లను ఎదుర్కొంది. చుట్టుపక్కల గ్రామాల్లో యువతకు యుద్ధవిద్యల్లో శిక్షణ ఇచ్చి పోరాడేలా చేసింది. ఆ క్రమంలో అక్కడే కన్నుమూసింది. నాగమ్మ దైవ స్వరూపమని భావించిన స్థానికులు ఆమెకు గుడి కట్టించారు. ఇప్పటికీ శ్రావణమాసంలో ఆమెకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాణి రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించడానికి వందల ఏళ్ల ముందే.. నాగమ్మ తెలుగింటి కీర్తిని చాటిందని, ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని చరిత్రకారులు అంటున్నారు. -
అనవసర యుద్ధాలకు దూరం
వాషింగ్టన్: ఇకపై విదేశాల్లో జరిగే యుద్ధాలకు తమ బలగాలను పంపమని, అవన్నీ అంతులేని నిరర్థక యుద్ధాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న తమ సైనికులను వెనక్కు రప్పిస్తామన్నారు. కేవలం తమ దేశానికి ప్రమాదమైన టెర్రరిస్టులను మట్టుపెట్టేందుకు మాత్రమే ఈ సైన్యాన్ని ఉపయోగిస్తామన్నారు. ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ దశాబ్దాలుగా అమెరికా రాజకీయవేత్తలు విదేశాల పునర్నిర్మాణం, విదేశీయుద్ధాల్లో పోరాడటం, విదేశీ సరిహద్దులను కాపాడడం వంటి పనులపై లక్షల కోట్ల డాలర్లు వెచ్చించారన్నారు. కానీ ప్రస్తుతం అమెరికా సేనలు అమెరికాను, అమెరికా నగరాలను రక్షించేందుకు పరిమితమవుతున్నాయని, అమెరికా బలగాలు స్వదేశాలకు వస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో జరిగే అనవసర యుద్ధాలకు సైన్యం వెళ్లదని, కానీ దేశానికి ముప్పుగా భావించే ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టదని చెప్పారు. తమకున్నంత సైనిక సంపత్తి ఎవరికీ లేదని, బలం చూపించే శాంతిని పరిరక్షిస్తామని వివరించారు. ఈ ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారు. కరోనా నిబంధనలను పక్కనబెట్టిమరీ జనం హాజరుకావడం ట్రంప్‌నకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే పన్నులు పెంచుతారని, ఆయుధాల హక్కును రద్దు చేస్తారని, ఆ పార్టీ నిండా వామపక్షవాదులున్నారని దుయ్యబట్టారు. క్యూబా, వెనుజులా విధానాలను డెమొక్రాట్లు అమలు చేస్తారని విమర్శించారు. డెమొక్రాట్ నాయకురాలు కమలా హారిస్‌పై నేరుగా విమర్శలు చేశారు. కరోనా సంక్షోభం నుంచి అమెరికా ఎకానమీని తొందరగా బయటకు రప్పించామని చెప్పుకున్నారు. -
ఆమె నా కన్నతల్లి కాదు.. అందుకేనేమో!
ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరిగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా? తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ‘పదహారేళ్లంటే నీకేం తెలుసు. లోకం ఎలా ఉంటుందో తెలుసా? బయట ఎంత ప్రమాదమో తెలుసా? మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? అసలు ఏం తెలుసని ఇంట్లో నుంచి పారిపోయావ్? పైగా ఆడపిల్లవి’ ‘మాట్లాడవేం?’‘అవన్నీ నాకు తెలుసో లేదో తెలియదు. కాని ఒక్కటి మాత్రం బాగా తెలుసు’‘ఏంటది’‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు మా అమ్మంటే ఇష్టం లేదు’ఆ జవాబుకు కన్సల్టేషన్ రూమ్‌లో నిశ్శబ్దం అలముకుందిఆ అమ్మాయికి అచ్చంగా పదహారేళ్లుంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై.పి.సి ఇష్టమని చేరింది. కాని చదవదు. కాలేజ్‌కని వెళుతుంది. కాని వెళ్లదు. మాట విన్నట్టే కనిపిస్తుంది కాని వినదు. హుషారుగా ఉన్నట్టు అభినయిస్తుంది కాని నిజంగా హుషారుగా ఉండదు.‘నాకు చాలా బెంగ’ అని మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో కనిపించిన హైస్కూల్నాటి ఫ్రెండ్‌కి.‘నాకూ బెంగే’ అని కుర్రాడు అన్నాడు.‘మనిద్దరం కష్టసుఖాలు చెప్పుకుందామా?’ అని టైప్ చేసింది.‘అందుకేగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తోంది’ అన్నాడు వాడు.ఆ అమ్మాయి తన తొలి కష్టం చెప్పుకుంది.‘మా అమ్మంటే నాకు ఇష్టం లేదు’‘నాకు మా నాన్నంటే ఇష్టం లేదు. ఎప్పుడూ తిడుతుంటాడు’ అన్నాడు వాడు.ఇలా కొన్నాళ్లు మాటలు నడిచాయి. ఇద్దరూ పెనుకష్టాల్లో ఉన్నారని ఆ కష్టాలకు ఇళ్లే కారణమని ఇళ్లలో నుంచి పారిపోతే పూర్తి కష్టాలు పోతాయని ఇద్దరూ అనుకుని పారిపోయారు.వైజాగ్ వెళ్లారు. అక్కడ ఏం చేయాలో తోచలేదు. అరకుకు వెళ్లి సాయంత్రం ఆ చీకటిని, తెలియని ముఖాలని చూసి బెంబేలెత్తారు. ఆ తర్వాత విజయవాడ వెళ్లారు. అక్కడి బస్ స్టేషన్లో ఆ అమ్మాయిని వదిలి ఇప్పుడే వస్తానని వాడు పారిపోయాడు. భయాన్ని తట్టుకోలేక ఇల్లు చేరాడని తర్వాత తెలిసింది. మొండి అమ్మాయి ఇంకో రోజు బెజవాడలోనిబస్టాండ్లో, రైల్వేస్టేషన్లో తిరిగి ఇల్లు చేరింది.ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా?తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ఇలా ఎంతకాలం అని భార్యనూ, కూతురిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి. ముందు ఎవరూ లేకుండా చేసి కూతురితో మాట్లాడాడు సైకియాట్రిస్ట్.‘ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ నాతో బాగుండదు. చీటికి మాటికి కోప్పడుతుంటుంది. కరెక్ట్ చేయాలని చూస్తుంటుంది. చూశారుగా నన్ను. కొంచెం పొట్టి. మా అమ్మా నాన్నల పక్కన ఎలుకపిల్లలా ఉంటాను వాళ్ల పర్సనాల్టీస్కి. అసలే కాన్ఫిడెన్స్ లేదు. చదువులో స్లో. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది నాతో కలవాలని అనుకోరు. ఇవన్నీ మా అమ్మకు డిస్శాటిస్ఫాక్షన్ అనుకుంటాను. అందుకని నాకు రిస్కీ ఫ్రెండ్షిప్స్ చేయడం అలవాటైంది. పక్కింటి అంకుల్‌తో, ఆటో అంకుల్‌తో, ఫేస్బుక్లో తెలియనివారితో ఇట్టే ఫ్రెండ్షిప్ చేస్తాను. తర్వాత వాళ్ల బిహేవియర్‌కి ఫ్రస్ట్రేట్ అవుతాను. ఒక ఫ్రెండ్‌తో ఇంట్లో నుంచి పారిపోతే వాడు కూడా నన్ను వదిలి పారిపోయాడు. నేను కోపంగా ఉంటానని మా అమ్మ అంటుంది. కాని మా అమ్మే కోపంగా ఉంటుంది. కాని సడన్‌గా ఒక డౌట్ వచ్చింది. ఏ తల్లీ సొంత బిడ్డతో ఇలా వ్యవహరించదు కదా... కొంపదీసి నేను ఈమెకు పుట్టలేదా? అని. అప్పుడు తెలిసింది...’‘ఏమని’‘నేను ఆమెకు పుట్టలేదు. మా పేరెంట్స్ నన్ను అడాప్ట్ చేసుకున్నారని. నాకు ఎనిమిదేళ్లప్పుడు ఆ సంగతి చెప్పారట..నాకు అర్థం కాలేదు... వాళ్లు ఆ సంగతి రిపీట్ చేయలేదు. టీనేజ్లోనే సరిగ్గా అర్థమైంది. ఇక ఇంట్లో ఎందుకుండాలి అనుకున్నాను’ ఆ అమ్మాయికి ఏడుపు తన్నుకొచ్చింది.సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయిని మనసారా ఏడవనిచ్చాడు. ఇప్పుడు ఎవరూ లేకుండా సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయి తల్లితో మాట్లాడాడు.‘డాక్టర్... మాది కలిగిన కుటుంబమే. కాని చిన్నప్పటి నుంచి సంతోషం లేదు. మా నాన్న డ్రంకర్డ్. అమ్మను నిత్యం బాధించేవాడు.వేధించేవాడు. అనుమానించేవాడు. భయంకరమైన గొడవలను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను. అలాంటి జీవితం నా సంతానానికి రాకూడదనుకున్నాను. పెళ్లితో అయినా నా జీవితం బాగుపడుతుందని ఆశించాను. నా అదృష్టం నా భర్త చాలా మంచివాడు. దురదృష్టం నా అత్తమామలు తగువులమారి స్వభావం ఉన్నవారు. 18 ఏళ్లకు పెళ్లయితే చిన్నదాన్నని కూడా చూడకుండా అన్ని పనులూ నా నెత్తినేసి సుఖం లేకుండా చేశారు. దానికి తోడు పిల్లలు పుట్టలేదు. ఏమిటా దురదృష్టం అని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చిన్నప్పటి డిప్రెషన్ ఇప్పటి డిప్రెషన్ అంతా కలిసి పేషెంట్‌లాగా మారాను’‘తర్వాత?’ సైకియాట్రిస్ట్ అడిగాడు.‘అప్పుడు మావారే సర్దిచెప్పి అడాప్ట్ చేసుకుందామనుకున్నారు. అనాథ శిశుశరణాలయం నుంచి ఎనిమిది నెలల పాపను దత్తత తీసుకున్నాం. నాకు పిల్లలు ఇష్టమే. ఎన్నో కలలు కన్నాను పెంపకం విషయంలో. కాని పాప మా ఇద్దరికీ ఏ మాత్రం పొంతన లేని ఎత్తుతో పెరిగింది. తెలివితేటలు లేవు. దానికి తోడు ప్రవర్తన కూడా ఏమిటోగా ఉంది. దానిని కంట్రోల్ చేయబోయి దానిపట్ల గయ్యాళిగా మారాను. నేను ఎంత ప్రేమిద్దామనుకున్నా ఎందుకు నా బతుకు ఇలా అయ్యిందా అనే నెగెటివ్ ఆలోచన. నా జీవితం నరకంగా మారింది. నా భర్తతో కూతురితో ఆనందంగా నేను ఎలా గడపాలి?’... ఆమె కళ్లు ధారలు కట్టాయి.మనసును కుదుటపర్చడంలో కన్నీళ్లకు మించిన మందు లేదు.సైకియాట్రిస్ట్ ఆమెను కూడా గుండె తేటపడే వరకు ఏడ్వనిచ్చాడు. ఇప్పుడు గదిలో ముగ్గరూ ఉన్నారు. తల్లి కూతురు తండ్రి.సైకియాట్రిస్ట్ మాట్లాడటం మొదలుపెట్టాడు.‘చూడండి... చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు. ఇంకా రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఉన్న వెలుతురును చూడకపోవడం. మీరిద్దరూ జీవితంలో నెగెటివిటీని చూడటానికే అలవాటు పడి జీవితం పట్ల రోత పుట్టించుకున్నారు. (తల్లివైపు చూస్తూ) బాల్యంలో మీరు తల్లిదండ్రుల కొట్లాటలు చూశారు. కాని మీరొక కలిగిన కుటుంబంలో పుట్టారని ఏ పోలియో బాధో అనారోగ్య సమస్యో దేవుడు మీకు ఇవ్వలేదని చదువు అబ్బని తెలివితక్కువతనం ఇవ్వలేదని సంతోషపడలేదు. పెళ్లయ్యాక వేధించే అత్తామామలను చూసి శోకించారు తప్ప ఒక్క లోపం లేని భర్త దొరికాడని ఆనందించలేదు. ముఖ్యంగా మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు తేల్చినా లోపం మీదేనని చెప్పినా మిమ్మల్ని పన్నెత్తు మాట అనని భర్తను చూసి జీవితాంతం సంతోషంగా బతకొచ్చని మీరు అనుకోలేదు. దత్తతకు కుమార్తె దొరికితే దానికీ సంతోషపడలేదు. కళకళలాడే ఆడపిల్ల అనుకోక రూపం గురించి, ర్యాంకుల గురించి బాధ పడ్డారు. ఒక్కసారైనా మీరు మీకు ఏమేమి ఉన్నాయో లిస్టు రాసుకుంటే అవి లేనివాళ్లు కోట్లమంది కనిపించి ఉండేవారు. మీ దృష్టి రుణాత్మకం కావడంతో వచ్చిన సమస్య ఇది’ అన్నాడు సైకియాట్రిస్ట్.ఆ తర్వాత కూతురి వైపు చూశాడు.‘చూడమ్మా... ఎందరో పిల్లలు అడాప్ట్ చేసుకునే తల్లిదండ్రులు లేక బాధపడుతుంటే మంచి తల్లిదండ్రులను నీకు దేవుడు ఇచ్చాడని నువ్వు కొంచెం కూడా సంతోషపడటం లేదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా లేవు. అమ్మ వేధిస్తుంది అంటున్నావే తప్ప నాన్న నిన్ను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడని మాటవరసకు కూడా అనలేదు. సొంత ఇల్లు, కారు, మంచి కాలేజీ ఇవి ఎంతమందికి ఉన్నాయి. అమ్మ సమస్య ఏమిటో తెలుసుకోకుండా అమ్మ మీద డిమాండ్స్ పెట్టి ఆమెను బాధపెట్టావు. మీది అన్నీ ఉండి ఎక్కువైన బాధ. అసలు ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు హాయిగా జీవనం సాగించే పరిస్థితుల్లో ఉన్నారన్న దానికి మించిన అదృష్టం ఏముంది? మీరు యుద్ధాలు జరిగే నేల మీద, భూకంపాలు వచ్చే చోట, కరువు తాండవించే చోట లేరని కర్ఫ్యూ మధ్య లేరని అప్పుల్లో లేరని తెలుసుకుంటే పోల్చి చూసుకుంటే మీ జీవితం ఎంత వరప్రసాదమో తెలుస్తుంది. అసలు ముందు మీకు ఉన్న గొప్ప పాజిటివ్ విషయాలేమిటో చెప్తూ వెళతాను. నెగెటివ్ విషయాలు వాటికవే దూదిపింజల్లా తేలిపోతాయి’ అన్నాడు సైకియాట్రిస్ట్.సెషన్స్ మొదలయ్యాయి.కొన్నాళ్లకు విడివిడిగా ఉన్న ఆ ముగ్గురు ఒక కుటుంబంగా బతకడం నేర్చుకున్నారు. ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
భవిష్యత్తులో జరిగేవి హైబ్రిడ్ యుద్ధాలే
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతో పాటు అంతరిక్షం, సైబర్, సమాచార రంగాలతో కూడుకున్న హైబ్రిడ్ యుద్ధాలే జరుగుతాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్‌లో భారత సాయుధ వాహనాలు–2017’ పేరిట బుధవారమిక్కడ జరిగిన సదస్సులో రావత్ మాట్లాడారు. ‘సంప్రదాయ యుద్ధరీతుల్లో పోరాడుతున్నప్పుడు ఉగ్రదాడులు, చొరబాట్లను, పరోక్ష యుద్ధాలను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఈ రెండింటినీ ఏకకాలంలో ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలి. భవిష్యత్‌లో సంప్రదాయ ఆయుధాలతోపాటు అంతరిక్ష, సైబర్, సమాచార రంగాలతో కూడిన హైబ్రిడ్ యుద్ధాలే జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు శత్రువుల వద్ద ఉండే ఆయుధ వ్యవస్థలు, సామగ్రి, సాంకేతికతల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అని రావత్ చెప్పారు. -
‘యుద్ధానికి సిద్ధంగా ఉండాలి’
యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందా? ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు ప్రపంచాన్ని కుదేలు చేస్తాయా? పాకిస్తాన్‌కు సహకరిస్తున్న చైనా.. ఏవరితో యుద్ధం చేయాలనుకుంటోంది? భారత్‌పై సమరానికి చైనా రెడీ అవుతోందా? అసలేం జరుగుతోంది? బీజింగ్ : ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆర్మీకి తేల్చి చెప్పారు. సెంటల్ర్ మిలటరీ కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిన్‌పింగ్.. సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో సైనికాధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎంసీ సమావేశం జరిగినట్లుగా చైనా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలోనే జిన్‌పింగ్ ప్రసంగిస్తూ.. సాయుధ బలగాలు.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను కొత్త శకంలోకి నడిపించేందుకు కొత్తమిషన్‌ను ప్రారంభించాలని జిన్‌పింగ్ సైన్యానికి స్పష్టం చేశారు. సీఎంసీ ఛైర్మన్ చైనా సైన్యానికి సర్వాధికారి. చైనా సైన్యం సీఎంసీ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తుంది. జిన్‌పింగ్ రెండోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. వరుసగా రెండోసారి సీఎంసీ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. రెండు సమవేశాల్లోనూ ఆయన సమరానికి సైన్యం సిద్ధంగా ఉండాలని పేర్కొనడం విశేషం. సీఎంసీ సమావేశంలో అధ్యక్షుడు, సీఎంసీ ఛైర్మన్ జిన్‌పింగ్‌తో పాటు ఇతర సైనిక ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. -
యుద్ధ సన్నద్ధతతో ఉండండి
బీజింగ్: ఎల్లప్పుడూ యుద్ధ సన్నద్ధతతో ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీకి విధేయంగా ఉంటూ, యుద్ధాలు గెలవడంపై దృష్టిపెట్టాలన్నారు. ఇటీవల ముగిసిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్(సీపీసీ) జిన్‌పింగ్‌కు తిరిగి అధ్యక్ష పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో ఆయన గురువారం రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ సీనియర్ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు. సైన్యంలో సంస్కరణలు అమలుచేయడంతో పాటు, వినూత్న విధానాలు అవలంబించాలని సైనికాధికారులకు సూచించారు. చట్టాలు, నియంత్రణలకు లోబడి కఠిన ప్రమాణాలతో సైన్యాన్ని ముందుకు నడిపించాలని దిశానిర్దేశం చేశారు. మిలిటరీలో పార్టీని పటిష్టం చేయాలని, యుద్ధ సన్నద్ధతకు సంబంధించి కసరత్తులను తీవ్రతరం చేయాలని కోరారు. సైన్యం భవిష్యత్ ప్రణాళికలకు ఎదురవుతున్న వ్యూహాత్మక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. -
గెలుపు పాఠం
ఎన్నో శతాబ్దాలు వలస పాలనలో ఉన్న పోలాండ్ పడిన చోటే నిటారుగా నిల్చుంది. సొంత ఉనికిని కాపాడుకుంటూ వడివడిగా అడుగులు వేసింది. ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా అభివృద్ధి జెండాను ఎగురవేసింది. 14వ శతాబ్దంలో పోలాండ్ బలమైన ఏకీకృత రాజ్యంగా ఉనికిలో ఉంది. 16వ శతాబ్దంలో సంపన్న రాజ్యంగా విలసిల్లింది. 17వ శతాబ్దంలో మాత్రం శత్రురాజ్యాల వల్ల పోలాండ్‌కు గడ్డు పరిస్థితి ఎదురైంది. రకరకాల యుద్ధాలు పోలాండ్‌ను నిట్టనిలువునా కూల్చేశాయి. ఆస్తి నష్టమే కాదు ప్రాణనష్టం కూడా విపరీతంగా జరిగింది. ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాలు పోలాండ్‌ను పంచుకున్నాయి. దీనికి వ్యతిరేకంగా పోల్స్ రెండు మూడుసార్లు తిరుగుబాటు చేసినా అవి విఫలం అయ్యాయి. పరాయి పాలకుల పాలనలో అణచివేతకు గురైన పోలాండ్ సంస్కృతి 19వ శతాబ్దంలో మళ్లీ వికసించింది. రాజకీయశక్తిగా కూడా పోలాండ్ బలపడింది. 1918లో పునర్నిర్మాణమైన పోలాండ్ ‘కమ్యూనిస్ట్ పోలాండ్’ (8 ఏప్రిల్ 1945)గా 1989 నుంచి ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’గా ఉనికిలో ఉంది.bజర్మన్లు, ఉక్రేనియన్లు, లిథువేనియన్లు...మొదలైన జాతుల ప్రజలు ఉండడం వల్ల దేశమంతా భిన్నమైన సాంస్కృతిక వాతావరణం కనిపిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని 16 ప్రాంతాలుగా విభజించారు. వీటిని ‘వైవోడేషిప్’ అంటారు. వీటిని 379 పొవైట్స్గా విభజించారు. దేశంలో 20 పెద్ద నగరాలు ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది వ్రోక్సా నగరం గురించి. ఈ పురాతన నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒకొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక వంతెన చొప్పున వ్రోక్సాలో వందకు పైగా వంతెనలు ఉన్నాయి. వ్రోక్సాలో 25 మ్యూజియమ్లు ఉన్నాయి. ఈ నగరానికి ఆనుకొని ఉన్న సుడెటెన్ కొండలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి. పోలాండ్ రాజధాని వార్సా. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఈ నగరం అభివృద్ధిపథంలో పయనించింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది యాత్రికులు వచ్చే ఈ నగరం యూరోపియన్ దేశాలలో ఆకర్షణీయమైన పర్యాటక నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పోలాండ్ ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన స్థితిలో ఉంది. దేశీయ విపణి బలంగా ఉండడమే దీనికి కారణం. విశేషం ఏమిటంటే 2000లలో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని కూడా తట్టుకొని నిలబడింది పోలాండ్. అభివృద్ధికి అవకాశం ఉన్నా అభివృద్ధి చెందలేని దేశాలు, రాజకీయ సంక్షోభాలతో చావు దెబ్బతిని ‘ఇక కోలుకోవడం కష్టం’ అని నిరాశపడే దేశాలు...పొలాండ్ నుంచి నేర్చుకోవాల్సిన విలువైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. టాప్ 10 1. ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం పోలాండ్. 2. పోలాండ్‌కి పశ్చిమంలో జర్మనీ, దక్షిణంలో చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, తూర్పులో ఉక్రెయిన్, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి. 3. పోలాండ్ అధికారిక నామం: ‘రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్’ 4. పోలాండ్ జాతీయచిహ్నం తెలుపు డేగ. 5. ‘పొలనై’ అనే తెగ పేరు నుంచి ‘పోలాండ్’ అనే పేరు వచ్చింది. దీని అర్థం...‘బహిరంగ ప్రదేశాల్లో నివసించే ప్రజలు’ 6. ‘వరల్డ్స్ స్రాంగెస్ట్ మ్యాన్’ టైటిల్ గెలుచుకున్న విజేతల్లో ఎక్కువమంది పోలాండ్ వారే ఉన్నారు. 7. {పఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్... ధార్న్ పట్టణం (కింగ్డమ్ ఆఫ్ పోలాండ్)లో జన్మించారు. 8. పాపులర్ స్పోర్ట్: ఫుట్‌బాల్. 9. 1999లో ‘నాటో’లో, 2004లో ‘యురోపియన్ యూనియన్’లో పోలాండ్ చేరింది. 10. పోలాండ్ కరెన్సీ ‘జోల్టీ’. పోలిష్‌లో దీని అర్థ్ధం బంగారం. దేశం పోలాండ్ రాజధాని వార్సా అధికార భాష పోలిష్ కరెన్సీ జోల్టీ జనాభా 3 కోట్ల 84 లక్షల 84 వేలు (సుమారుగా) -
ఆ నేడు 15 అక్టోబర్, 1969
అణువణువూ నినాదమై... ‘యుద్ధాలు ఎందుకు?’ అనే సీరియస్ ప్రశ్నకు, ఎవరో ఇచ్చిన సరదా సమాధానం...‘యుద్ధాల కోసమే!’ చరిత్రలో చాలా యుద్ధాలు ఈ కోవకే చెందుతాయి. ‘వియత్నాం వార్’ను ఈ కోవలోనే చేర్చినా... ఇంకా చెప్పుకోవడానికి అది మాత్రమే సరిపోదు. వియత్నాం వార్ అంటే... రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధం అని చరిత్ర అంటుంది. చాలామంది మాత్రం ఈ చారిత్రక నిర్వచనానికి భిన్నంగా స్పందించారు. ‘అది యుద్ధం కాదు’ అన్నారు. ‘బలమైన ఏనుగు చలి చీమపై కయ్యానికి కాలుదువ్వడం’అన్నారు. ‘బలహీనుల బలమైన ఐక్యత ముందు బలవంతుడు ఎలా బలహీనుడవుతాడో చెప్పిన యుద్ధం’ అన్నారు. సుమారు ఇరవై ఏళ్ల సాగిన వియత్నాం వార్‌లో... ఆస్తినష్టం, ప్రాణనష్టం ఎంతో జరిగింది. ఈ యుద్ధం నుంచి అమెరికా ఏం బావుకుంది?అనే ప్రశ్నకు కొందరు చెప్పే సమాధానం ‘గుణపాఠం’! అగ్రరాజ్యం అమెరికా గుణపాఠం నేర్చుకుందా, పాత పాఠాలనే మళ్లీ మళ్లీ వల్లిస్తుందా అనేది వేరే విషయంగానీ వియత్నాం వార్ని ఆపడానికి ప్రజాస్వామిక వాదులు, శాంతికాముకులు చాలా ప్రయత్నాలే చేశారు. ఈ శాంతి ఉద్యమంలో ప్రపంచమే కాదు... అమెరికా కూడా ఉండడం విశేషం! వియత్నాం వార్‌పై మారటోరియం విధించాలని అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. మేధావులే కాదు సామాన్యులు కూడా ఈ శాంతి ఉద్యమంలో పాల్గొని తమ యుద్ధ వ్యతిరేఖతను గట్టిగా చాటారు. -
ఆ నేడు ఆగస్ట్ 27, 1896
జస్ట్... 38 నిమిషాల్లోనే! యుద్ధాలు నెలల పాటు సాగుతాయి. మూడ్ మరీ బాగుంటే సంవత్సరాలు సా....గుతాయి. అయితే ప్రసిద్ధ బ్రిటన్-జాంజిబార్ యుద్ధం మాత్రం... స్నానం చేసి, టిఫిన్ పూర్తయ్యేలోపే పూర్తయింది. 38 నిమిషాల్లో ముగిసిపోయిన ఇదీ ఒక యుద్ధమేనా?’ అని మూతిముడిచారు యుద్ధప్రేమికులు. ‘హమ్మయ్య’ అనుకున్నారు శాంతికాముకులు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది’ అనేది సామెత. ఇక్కడ...బ్రిటీష్ అనుకూలుడైన జాంజిబార్ సుల్తాన్ హమద్ బిన్ చావు... యుద్ధానికి వచ్చింది. ఆయన తర్వాత గద్దెనెక్కిన ఖలీద్ తనకు అనుకూలుడు కాకపోవడంతో అతడిని గద్దె దించడానికి బ్రిటన్ ఈ యుద్ధం చేసింది. ‘షార్టెస్ట్ వార్’గా ఇది చరిత్రలో నిలిచింది! -
నాలుగో ప్రపంచ యుద్ధం!
1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసవాదులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. ఆ ప్రాంతాల్లోని పాలక కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపద కు, జాతీయ వనరులకు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. ప్రతి ప్రయోగమూ నియంతృత్వాల వైపే దొర్లుకుపోయింది. పాశ్చాత్య దేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు. యుద్ధాలు చాలావరకు గందరగోళపు ఉపోద్ఘాతంతో మొదలై, తరచూ చేదు ఉపసంహారంతో ముగుస్తాయి. 1919 నాటి వర్సెయిల్స్కు 1939కి మధ్య ఉన్న పీటముడి నేడు ప్రామాణిక జ్ఞానమే. యుద్ధానంతరం విజేతలు యూరప్‌ను తమలో తాము పంచేసుకొని, గెలుచుకున్న భూభాగాల రక్షణ కోసం మోహరించిన యాల్టాలోనే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అఫ్ఘానిస్థాన్‌లో సోవియట్ యూనియన్ ఓటమితో ప్రచ్ఛన్న యుద్ధం అంతం కాగా, సరిగ్గా అక్కడే ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం మొదలైంది. అఫ్ఘాన్ పోరులో మిత్రులై నిలిచినవారు దాదాపుగా విజయం సాధించిన వెనువెంటనే ఒకరికొకరు విరోధులయ్యారు. 1945 నాటి విజేతలు చేసింది కూడా చాలా వరకు ఇదే. హఠాత్తుగా ఇస్లామిజం వృద్ధి చెందడంతో అమెరికా, యూరప్‌లు దిగ్భ్రాంతికి గురయ్యాయి. చిట్టచివరి ముస్లిం మహాసామ్రాజ్యమైన అట్టోమన్ ఖలీఫా సామ్రాజ్యాన్ని ఛిన్నాభిన్నంచేసి, వలసీకరణం చెందించిన 1919 నాటి ద్వితీయ కథనాన్ని విస్మరించడమే వారి నివ్వెరపాటుకు కారణం. సమస్యాత్మకమైన ఒక శతాబ్ది గడిచిన తదుపరి... నాలుగవ ప్రపంచ యుద్ధం తో కలగలిసేలా మొదటి ప్రపంచ యుద్ధం మళ్లీ తిరిగి వస్తోంది. ప్రపంచంలోనే ముస్లిం జాతుల ప్రజలు అత్యధికంగా ఉన్న భారత ఉపఖండంలోని మొఘల్ సామ్రాజ్య అవశేషాలను బ్రిటన్ 1919కి దాదాపు ఏడు దశాబ్దాలకంటే ముందుగానే భూస్థాపితం చేసింది. (విక్టోరియా రాణి పాలన కిందనే ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారంటూ నాటి చాదస్తపు పొగరుబోతు రాజకీయ వేత్తలు... నిజమైన ఖలీఫా ఆమే అంటూ అట్టోమన్లను వేధించేవారు.) 1919లో ఒక విపరీత పరిణామం జరిగింది: యూరోపియన్ దేశాలు ముస్లిం భూభాగా ల్లో ప్రతి ఒక్కదాన్నీ ఆక్రమించడమో లేక వలసగా మార్చడమో చేశాయి. అది వారికి భరింపశక్యం కానంతటి పెద్ద అవమానం. గంగా నది నుండి నైలు నది వరకు అంతటా ముస్లింలు గత వైభవ పునరుద్ధరణ కోసం అన్వేషించారు, అలా పరితిపించడంలోనే సౌఖ్యాన్ని పొందారు. ఖలీఫా రాజ్యం వాస్తవంగా ఎన్నడూ లేనంతటి ఉజ్వలమైనదిగా జ్ఞాపకాలలో భాసిల్లింది. ఖలీఫా రాజ్యం పట్ల ఈ ఆరాధన ఒక శక్తివంతమైన ప్రేరణ అయింది. ముస్లింలు నిరంతర ముట్టడిలోనున్న యుగంలో ఖలీఫా రాజ్యం ఇస్లాం మత, మత పవిత్ర స్థలాల పరిరక్ష ణకు సంకేతమైంది. గత వైభవానికి ఉద్వేగభరితమైన సంకేతమైంది. తమ సొంత నియంతల నిరంకుశత్వం నుండి ముస్లింలకు రక్షణగా షరియా ఉంటుందన్న భరోసాను వారికి కలిగించింది. భారత దేశంలో మహాత్మా గాంధీ మహాశక్తిని 1919-1922 మధ్య బ్రిటిష్ వ్యతిరేక ప్రజోద్యమంలోకి ముస్లింలను ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారు. 1924లో టర్కీ ఖలీఫా వ్యవస్థను నిషేధించడం నాటి ఖిలాఫత్ ఉద్యమానికి పరిహాసోక్తిలాంటి ముగింపు. ముస్తఫా కెమల్ పాషా నేతృత్వంలోని టర్కీ 20వ శతాబ్దంలోకి హేతుబద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. హాప్స్బర్గ్లు, జార్లలాగే ఖలీఫాలు కూడా ప్రయోజనాన్ని కోల్పోయినా ఇంకా మిగిలివున్న యుగానికి చెందినవని గుర్తించింది. భారత ముస్లింలలోని ఉన్నతవర్గాలు బ్రిటన్ కత్తితో 1947లో తమకంటూ ప్రత్యేకంగా పాకిస్తాన్‌ను విడిగా కత్తిరించి తీసుకున్నారు. దీంతో వారికి వారి ఆందోళనల నుండి ఉపశమనం లభించింది. భగవంతుని భౌగోళికత పాకిస్తాన్‌ను ఉపఖండానికి రెండు కొసల్లోను ఉండే రెండు భాగాలుగా విడదీసింది. అయినాగానీ మతం వాటిని ఐక్యం చేయగలదని పాకిస్థాన్ వెర్రిగా విశ్వసించింది. నిజానికి పాకిస్థాన్ దక్షిణాసియా టర్కీ కాగలిగేదే. కానీ అందుకు బదులుగా అది మతపరమైన ఉద్వేగాలను, ప్రజాస్వామ్యాన్ని కలగలిపింది. ఆ రెండు ప్రపంచాలలోనూ అది అత్యంత అధమమైన దాన్ని సాధించడంలో సఫలమైంది. వలసవాద అనంతర కాలంలో పాకిస్తాన్ దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి ఇస్లామిక్ దేశం అయింది. ప్రజల్లో సమంజసత్వాన్ని సంపాదించుకోడానికి అనివార్యంగానే అది జిహాద్ జెండాను పట్టిన నానా గోత్రీకులైన ఉగ్రవాదులకు సురక్షిత స్థావరమైంది. 1919లో బ్రిటిష్, ఫ్రెంచ్ వలస యజమానులు వదిలి పోయిన తర్వాత అరబ్బు ప్రపంచం ముక్కలు చెక్కలైంది, చీలికలు పీలికలైంది. నయావలసవాద స్వర్గధామమైంది. ఉపయోగించుకోకుండా ఉండే షరతుపై నయావలసవాదం దేశాలకు, ప్రజలకు స్వాతంత్య్రాన్ని ప్రసాదిస్తుంది. అదైనా ఆర్థిక సాధికారత, ప్రజాస్వామిక స్వేచ్ఛలతో కూడినదై ఉండి ఉంటే అదేమైనా పనికొచ్చి ఉండేదేమో. కానీ నయావలసవాదం అలా ఉండాలనే యోచనే ఒక వైరుధ్యం కావచ్చు. కుటుంబ వ్యవస్థలు త్వరలోనే వ్యక్తిగత సంపదకు, జాతీయ వనరుల కు మధ్య సరిహద్దు రేఖలను మసకబరిచాయి. వామపక్షం నుండి పుట్టుకొచ్చినదైనా లేక మితవాదపక్షం నుండి పుట్టుకొచ్చిందైనాగానీ... ప్రతి ప్రయోగమూ మృదువైన లేదా కఠోర నియంతృత్వం వైపే దొర్లుకుపోయాయి. పాశ్చాత్యదేశాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునే సాధనంగా యుద్ధానికి దిగడం లేదా మరింత హేయమైన పద్ధతుల్లో ప్రభుత్వాలను మార్చడం వల్ల జరిగిన మేలేమీ లేదు. ఆధునికతకు సంబంధించిన వైఫల్యమేదైనాగానీ ఊహాత్మకమైన గతానికి ఆహ్వానం పలికేదే. రాచరిక పితృస్వామ్యం నుండి నాజర్ తరహా జనరంజక విధానాల వరకు, బాతిస్టుల ఉదారవాదం వరకు అన్ని నమూనాలు మిగతావాటిలాగే సైనిక నియంతృత్వానికి దారితీశాయి. చివరకు తాత్కాలిక ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లువెత్తినా... అదీ కుప్పకూలింది, అణచివేతకు గురైంది. కడకు నిలచినది మత విశ్వాసానికి తిరిగి పోవడమనే భావన ఒక్కటే. వర్తమాన నేపథ్యంలో దీనికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ తెలియదనేది వేరే సంగతి. అది చేసింది ఒక్కటే... మదీనా పట్ల విశ్వాసాన్ని తగ్గించి, అరేబియాలోనూ, భారత్‌లోనూ ఇస్లామిక్ మిలిటెన్సీ పుట్టి పెరిగేలా చేయడం మాత్రమే. ఆ ధోరణి ముస్లింలలో అభద్రతను, తీవ్రవాదాన్ని పెంపొందింపజేసి నిరాశావాదాన్ని రేకెత్తించడానికి తోడ్పడిందే. తద్వారా మన దేశంలో భ్రమాత్మకమైన విముక్తి ముసుగులోని అరాచక పరిస్థితుల అన్వేషణలో వెర్రిగా మారిన జిహాద్‌కు ప్రేరణ లభించింది. ఈ క్షీణత అతి వేగంగా సాగింది. నేడు పాకిస్తాన్ నుండి ఉత్తర ఆఫ్రికా వరకు అల్లకల్లోలంగా ఉంది. ఆ ప్రాంతంలో చాలా ప్రభుత్వాలు ఏకాకులయ్యాయి, దేశాలు అదుపు తప్పి పోతున్నాయి. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం జిహాద్ అనేది రాజ్యం ప్రకటించేదిగా ఉండటమనేదే మౌలిక ఆవశ్యకత. ఈ సంప్రదాయ విరుద్ధమైన జిహాద్ ప్రమాదకరంగా విస్తరిస్తుండటమే సిద్ధాంతాన్ని వదిలేసిన ఆచరణవల్ల కలిగే ప్రమాదాలకు రుజువు. జిహాద్‌కు లక్ష్యాలుగా ఉన్న ‘సుదూరంలోని శత్రువు’ అంటే ప్రధానంగా అమెరికా, కాగా, ‘సమీప శత్రువు’ అంటే తక్షణ పరిసరాల్లో వారితో వైరం గలవారంతా. ఇక ‘మూడో శత్రువు’ అంటే ఇస్లామిక్ భూభాగాలను ‘ఆక్రమించిన’ దేశాలు. భారత్, చైనాలు (జింజియాంగ్‌లో ముస్లింలు మెజారిటీ కాబట్టి) ఈ చివరి వర్గానికి చెందుతాయి. ఈ యుద్ధం ఎప్పుడు, ఎలా అంతమవుతుందో అంచనా కట్టడం కష్టం. అయితే ఇది మిగతా వారికి నష్టం కలిగించడం కంటే ముందే ముస్లిం ప్రజలకు వినాశనాన్ని కలుగజేస్తుంది. (నవంబర్ 21 నుండి 23 వరకు జరిగిన ‘‘హాలిఫాక్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఫోరమ్’’ ప్లీనరీ సందర్భంగా చర్చనీయాంశంగా రచించిన వ్యాసమిది.) -
సాంఘిక చరిత్ర మన చరిత్రయే!
గ్రంథం చెక్క రాజుల యుద్ధాలు, తంత్రాలు, దౌష్ట్యాలు సంఘానికి నష్టం కలిగించినట్టివే. ఈ విషయం గుర్తించిన పాశ్చాత్యులు సాంఘిక చరిత్రకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇదియే సరియగు పద్ధతి. రాజుల చరిత్రలు మనకు అంతగా సంబంధించినవి కావు. సాంఘికచరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ ఆటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పుడుడెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన అభిలషింతురు. తేలిన సారాంశమేమన... సాంఘిక చరిత్ర మన చరిత్రయే! మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే!! సాంఘిక చరిత్ర మానవ చరిత్ర. ప్రజల చరిత్ర. అది మన సొంత కథ!! అది జనుల జీవనమును ప్రతి శతాబ్దమందెట్లుండెనో తెలుపునట్టిది. అది మన తాతముత్తాల చరిత్ర! - సురవరం ప్రతాపరెడ్డి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ నుంచి (సురవరం ప్రతాపరెడ్డి ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. రేపు ఆయన జయంతి) -
దేశం కోసం... పతకం, ప్రాణం...
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 1939 నుంచి 1945 వరకు ఆరేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన రెండో ప్రపంచ యుద్ధం రక్తపాతాన్ని సృష్టించింది. రక్తం ఏరులై పారిన ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత వైకల్యం పొందారు. అయితే ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తమ దేశానికి పతకాలు అందించిన ఒలింపియన్లు కూడా ఉన్నారు. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఒలింపిక్స్‌లో పాల్గొని తమ దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా రెపరెపలాడించిన క్రీడాకారులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారు.. స్ఫూర్తిని నింపిన అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం... ఫాయ్ డ్రాపర్.. అమెరికా అథ్లెట్... ఒలింపిక్స్‌లో అమెరికా జాతీయ పతకం రెపరెపలాడించడంలో తనవంతు పాత్ర పోషించాడు. 1936లో బెర్లిన్ ఆతిథ్యమిచ్చిన ఒలింపిక్స్‌లో స్టార్ అథ్లెట్ జెస్సీ ఒవెన్స్తో కలిసి 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకం అందించాడు. ఈ ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అప్పటికే అమెరికా రక్షణ దళంలో ఆర్మీ ఎయిర్ కార్ప్స్ పెలైట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. 1943లో శత్రుదేశాల దాడిలో... 32 ఏళ్లకే డ్రాపర్ ప్రాణాలు విడిచాడు. కార్ల్ లుజ్ లాంగ్... ఒలింపిక్ లాంగ్ జంపర్.. జర్మనీ ఆర్మీలో ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన లాంగ్ 1943లో ఆర్మీ చేపట్టిన చర్యలో మరణించాడు. 30 ఏళ్లకే అసువులు బాసిన లాంగ్‌ను... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 1964లో డి కూబర్టిన్ మెడల్‌తో (క్రీడాస్ఫూర్తి ప్రదర్శిం చినందుకు) సత్కరించింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో లాంగ్ రజత పతకం సాధించాడు. నిజానికి ఆ ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్‌లో లుజ్ లాంగే స్వర్ణం గెలవాల్సింది. కానీ తన ప్రత్యర్థి, అమెరికా లాంగ్ జంపర్ జెస్సీ ఒవెన్స్ తడబాటుకు గురవడంతో ఫైనల్ చేరేందుకు సలహాలు ఇచ్చాడు. లాంగ్ ఇచ్చిన సలహాతో ఫైనల్స్‌లో ఒవెన్స్ సత్తా చాటాడు. లాంగ్‌ను వెనక్కినెట్టి బంగారు పతకం గెల్చుకున్నాడు. టకిచి నిషి.... 1932 లాస్‌ఎంజిలిస్ ఒలింపిక్స్‌లో జపాన్ తరఫున ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత జంపింగ్ విభాగంలో పాల్గొని స్వర్ణం సాధించాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945లో ఇవో జిమా ఐలాండ్‌లో అమెరికా- జపాన్ సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. జపాన్ ఆర్మీలో కల్నల్ హోదాలో ఉన్న టకిచి నిషి యుద్ధంలో పాల్గొన్నాడు. అమెరికా సేనలు జరిపిన దాడిలో నిషి మరణించాడు. జూలీ దర్శకత్వంలో జంపరిని జీవిత గాథ... లూయిస్ జంపరిని (అమెరికా)... ప్రస్తుత వయసు 97. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన జంపరిని 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. పతకం చేజారినా జంపరిని తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి ప్రశంసలు కూడా పొందాడు. ఆ తర్వాత అమెరికా వాయుసేనలో చేరిన జంపరిని రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా యుద్ధవిమానం కూలిపోవడం... శకలాల సాయంతో 47 రోజుల పాటు సముద్రంలోనే గడపడం.. ఆ తర్వాత యుద్ధ ఖైదీగా పట్టుబడటం... అష్టకష్టాలు పడి చివరికి క్షేమంగా బయటపడటం.. ఇదే ఇతివృత్తంగా హాలీవుడ్ స్టార్ అంజె లీనా జూలీ ‘అన్ బ్రోకెన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇదే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. చార్లెస్ పదోక్... అమెరికా ట్రిపుల్ ఒలింపియన్...మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ మెరైన్స్లో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి దేశం కోసం పోరాడాడు. ఆ తర్వాత చదువుపై ఆసక్తి కనబరిచి... చివరికి క్రీడలపై దృష్టిపెట్టాడు... స్ప్రింటర్‌గా భేష్ అనిపించుకున్న పదోక్... ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో హీరోగా మారిపోయాడు. 20 ఏళ్లకే ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన పదోక్ 1920 ఆంట్వెర్ప్ (బెల్జియం) ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించాడు. అంతేకాదు 200 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకున్నాడు. తదుపరి 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 200 మీటర్ల పరుగులో రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక 1928 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా పతకం మాత్రం దక్కలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1943లో సిట్కా (అలస్కా) సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మేజర్ జనరల్ విలియమ్‌తో కలిసి ప్రాణాలు విడిచాడు. -
ఆయుర్వేదంపై ఆసక్తి
కొండాపూర్, న్యూస్‌లైన్: ఆయుర్వేద వైద్యానికి పల్లెల్లోని ప్రజలు మక్కువ చూపుతున్నారు. సహజంగా లభించే ఔషధ వనమూలికలు, వాయిదినుసులు ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఆయుర్వేద వైద్యుల సహకారంతో సర్వ రోగాలకు నివారణిగా త యారుచేసిన సంజీవని చూర్ణాన్ని ప్రజ లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మండలంలో ఏకైక ఆయుర్వేద వైద్యశాల మారెపల్లిలో ఉంది. మిగతా 20 గ్రామాల్లో హైదరాబాద్ చెందిన మాన స ఆయుర్వేద ఆస్పత్రి, కృష్ణలాల్ మదన్‌లాల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వారు ఊరూర తిరుగుతూ గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బహిరంగంగా ఔషధ మూ లికలు, వాయిదినుసులు 168 రకాల ఆయుర్వేద వస్తువులను సమ భాగాలుగా తీసి రోలు కుందెనగడ్డ పారతో తయారుచేసి సర్వరోగ నివారణ కోసం గ్రామాల్లోనే ఇస్తున్నారు. పదేళ్ల పిల్లలకు 30 గ్రాముల చూర్ణం 11 రోజులు, పెద్దలకు 60 గ్రాముల చూర్ణం 21 రోజులు వాడాలని సూచిస్తున్నారు. వంకాయ, గోంగూర, గోరు చిక్కుడు, ఎండు చేపలు, బంగాళదుంపలు చూర్ణం వాడే సమయంలో ఉపయోగించవద్దని సూచి స్తున్నారు. గ్యాస్ ట్రబుల్, పక్షవాతం, బీ పీ, అల్సర్, మోకాళ్ల నొప్పులు, సొరి యాసిస్, ఆస్తమా, అలర్జీ, అజీర్ణం, ఉ బ్బసం, తిమ్మిర్లు, అర్శమొలలు, కిడ్నీలో రాళ్లు, దగ్గు తదితర దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద చూర్ణం పనిచేస్తుందని చెబుతున్నారు. అయితే ఆయుర్వేదంపై గ్రామాల్లో అవగాహన కలిగినవారు కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఆయుర్వేద మందులతో రోగాలు పూర్తిగా నయమవుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆయుర్వేదంపై ప్రచారం చేసి మందులను అందుబాటులో ఉంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.