ఆ నేడు ఆగస్ట్ 27, 1896
జస్ట్... 38 నిమిషాల్లోనే!
యుద్ధాలు నెలల పాటు సాగుతాయి. మూడ్ మరీ బాగుంటే సంవత్సరాలు సా....గుతాయి. అయితే ప్రసిద్ధ బ్రిటన్-జాంజిబార్ యుద్ధం మాత్రం... స్నానం చేసి, టిఫిన్ పూర్తయ్యేలోపే పూర్తయింది. 38 నిమిషాల్లో ముగిసిపోయిన ఇదీ ఒక యుద్ధమేనా?’ అని మూతిముడిచారు యుద్ధప్రేమికులు. ‘హమ్మయ్య’ అనుకున్నారు శాంతికాముకులు.
‘ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది’ అనేది సామెత. ఇక్కడ...బ్రిటీష్ అనుకూలుడైన జాంజిబార్ సుల్తాన్ హమద్ బిన్ చావు... యుద్ధానికి వచ్చింది. ఆయన తర్వాత గద్దెనెక్కిన ఖలీద్ తనకు అనుకూలుడు కాకపోవడంతో అతడిని గద్దె దించడానికి బ్రిటన్ ఈ యుద్ధం చేసింది. ‘షార్టెస్ట్ వార్’గా ఇది చరిత్రలో నిలిచింది!