
బీబీనగర్: గ్రామీణ రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను బీబీనగర్ ఎయిమ్స్ వైద్యశాలకు తరలించి, వాటి ఆధారంగా తిరిగి రోగులకు అవసరమయ్యే మందులను డ్రోన్ విమానంలో తరలించేలా అధికారులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి భువనగిరిలోని ఓ మార్కెట్ ఆవరణలో నుంచి చిన్నపాటి డ్రోన్‌లో మందులను అమర్చి కంప్యూటర్ ద్వారా నియంత్రిస్తూ ఎయిమ్స్‌కు పంపినట్లు సోషల్ మీడియాలో బుధవారం ఓ వీడియో వైరల్ అయింది.
దీనిపై ఎయిమ్స్ అధికారులు, డ్రోన్ విమానాన్ని తరలించిన ప్రాజెక్టు నిర్వాహకులను వివరాలను అడిగినప్పటికీ వెల్లడించకపోవడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎయిమ్స్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా వైద్య శిబికాలె నిర్వహిస్తున్నారు. రోగుల నుంచి వివిధ పరీక్షల నమూనాలను సేకరించి వారికి సిబ్బంది నేరుగా మందులను పంపిణీ చేస్తారు. కానీ, ఇప్పుడు డ్రోన్ విమానం ద్వారా ఎయిమ్స్‌కు మందులు, శాంపిల్స్ తరలించేలా ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment