![Drone Spotted At Addanki Medarametla Siddham Sabha - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/10/Drone_Addanki_Sabha.jpg.webp?itok=xf7e3oDk)
సాక్షి, బాపట్ల: ఆదివారం అద్దంకి మేదరమెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచే ప్రకటించారు. ఆ సమయంలో సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఆ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఇక కాసేపటికే మైక్ అందుకుని ‘‘ఏయ్ పప్పూ... ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్‌ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే ఈ షర్ట్ తడిచిపోవడం ఖాయం’’ అంటూ వైఎస్సార్‌సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్‌ను ఉద్దేశించి సవాలు విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment