
సాక్షి, బాపట్ల: సీఎం జగన్‌కు ప్రజల అండదండలు ఉన్నాయని.. ఎన్ని పార్టీలు కూటమి కట్టినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేవని మాజీ మంత్రి, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ..
‘‘వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం అవుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.