మా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటే ఒక్కడూ రాడా? అదే జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్దమా అంటే లక్షలాది మంది ఉత్సాహంగా ఉరకలేస్తూ వచ్చి జయ జయ ధ్వానాలు పలుకుతారా? ఏంటీ అన్యాయం? ఏంటీ ఘోరం? అని తెలుగుదేశం-జనసేనలతో పాటు ఎల్లో మీడియా ఏడ్చిచస్తోంది. బాబు జేబు మీడియాల్లో ఒకటేమో అసలు జనమే రాలేదంది. ఇంకోటి అబ్బే వాళ్లు జనం కారు గ్రాఫిక్సే అని లోకేష్ చెప్పారంది. ఆ సభలకు ఇంత ఖర్చు అవసరమా అంది. వచ్చిన వాళ్లకి మూడుపూటలా భోజనాలు పెట్టేస్తున్నారని మరో ఏడుపు.
ఇది భీమిలి సిద్ధం సభ. ఇదిగో ఇది దెందులూరులో జరిగిన రెండో సభ. ముచ్చటగా మూడోది అనంతపురం జిల్లా రాప్తాడు లోనిది. మొదటి మూడింటినీ తలన్నేసిన మేదరమెట్లలో జరిగిన నాలుగో సిద్ధం సభ. నాలుగు సభల్లోనూ జనసునామీలను చూశారు కదా. ఇంతమంది తరలి రావడం పచ్చ మందకు ఒక ఏడుపు అయితే వచ్చిన వారు తిన్నంగా కూర్చోకుండా జగన్ మోహన్ రెడ్డికి జై జై నినాదాలు కొట్టడం.. ఆయన ప్రసంగం చేసేటపుడు అడుగడుగునా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఎగిరి గంతులేస్తూ చేతులు ఊపుతూ జెండాలు రెపరెప లాడిస్తూ మహాజాతరను తలపించేలా వ్యవహరించడం పచ్చ బ్యాచ్కి అస్సలు నచ్చలేదు. అది వాళ్లకి జీర్ణం కాకుండా ఉంది.
వాళ్లు అలా ఏడవడంలో అర్ధం కూడా ఉంది. లోకేష్ నిర్వహించే శంఖారావం సభలు చూశారుగా. జనం లేకుండా ఎలా వెలవెల బోతూ ఉంటాయో తెలుసు కదాచంద్రబాబు నాయుడు గొంతు చించుకుని రా కదలి రా బాబూ అని పిలిచినా జనం కుర్చీలు మడత పెట్టేసినట్లు అరకొరగా సభలో ఈసురోమంటూ కూర్చోవడాలు చూశారు కదా.
తానొక్కడూ పిలిస్తే రావడం లేదని.. పవన్ కల్యాణ్ ను కూడా పక్కన కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు తన పుత్రరత్నం లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభను చూశారు కదా. లక్షకు పైగా జనం వస్తారని టిడిపి నేతలు అంచనాలు వేసుకుంటే 12 వేల పైచిలుకు మంది మాత్రమే వచ్చిన దృశ్యం గుర్తుంది కదా.
మంగళగిరి బీసీ జయహో సభ
మంగళగిరిలో టిడిపి నిర్వహించింది బీసీల సభ. మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోనే లక్షమందికి పైగా బీసీలు ఉంటారని అంచనా. ఇక క్రౌడ్ పుల్లర్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు కదా పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం ప్రజలూ కూడా తరలి వచ్చేస్తారు కదా అన్నది బాబు లెక్క. కానీ ఆ లెక్క తప్పేసింది. సభ చీదేసింది. బాబు మొహం మాడిపోయింది. పవన్ అహం దెబ్బతింది. లోకేష్ మొహం చిన్నబోయింది. టిడిపి నేతల్తో ఉన్న పిసరంత నమ్మకం కాస్తా పోయింది. రాసుకోడానికి ఎల్లో బ్యాచ్ కీ ఏమీ లేకుండా పోయింది.
ఒకటి మన చంద్రబాబు మన పవన్ పెట్టిన సభలకు జనం రావడం లేదాయె.రెండోది జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా జన సునామీలు పోటెత్తుతున్నాయి.ప్రజలు ఇంత దారుణంగా తమని దూరం పెట్టేస్తే బాధగా ఉండదండీ? ఒళ్లు మండిపోదాండీ? పచ్చ పార్టీ ఇంత దైన్యంగా ఉంటే ఎల్లో మీడియాకు కడుపు మంట ఉండదాండీ?ఉంటుందుంటుంది. ఆ మంటతోనే ఈ రాతలు. రామోజీరావు పత్రికలో అయితే గ్రాఫిక్స్ అన్నారు. సరే గ్రాఫిక్స్ అయితే జనం లేనట్లే కదా. ఇక ఎల్లో వారికి ఇబ్బందేమిటి? వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేశారని నీచపు రాత రాయించారు రామోజీ. సిద్ధం సభలకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేస్తోంది కానీ..ప్రభుత్వానికి సంబంధం లేదు. అటువంటప్పుడు ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రామోజీ పత్రిక నడిపేస్తున్నారు.
ఏడుపులు అన్నీ ఇన్నీ కావు. వచ్చిన వారికి బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు ఇచ్చేస్తున్నారని రామోజీ రాసుకొచ్చారు. తమ సభలకు వచ్చిన వారికి కావల్సిన ఏర్పాట్లు చేయడం రాజకీయ పార్టీల బాధ్యత. గతంలో టిడిపి కూడా సభలు నిర్వహించింది. అప్పుడూ కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. బాబు హయాంలో అయితే బిర్యానీ ప్యాకెట్టే కాదు మందు బాటిళ్లు కూడా ఇచ్చేవారు. మరప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతోందని ఎందుకు రాయలేదు?
సిద్ధం సభలతో మామూలు ప్రయాణికులకు బస్సులు చాలాక ఇబ్బందులు పడ్డారని రాశారు. నిజమే కొన్ని బస్సులు తగ్గినపుడు ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే స్వాతంత్ర్యం వచ్చింది లగాయితు అన్ని రాజకీయ పార్టీల సభలకూ ఆర్టీసీ బస్సులను వాడుకున్న చరిత్రే ఉంది. అపుడూ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు హాయంలో టిడిపి సభలకు ఆర్టీసీ బస్సులు కాకుండా బెంజ్ కార్లను వాడారా?
విషయం ఏంటంటే ఇబ్బంది పడుతోంది జనం కాదు. రామోజీరావు.రాథాకృష్ణ. అండ్ అదర్ ఎల్లో మీడియాసే. కుత కుత లాడిపోతోంది టిడిపి,జనసేన అధినేతలే.వణికిపోతోంది టిడిపి-జనసేన శ్రేణులే.అయితే దానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదు. తమని జనం ఎందుకు దూరం పెట్టారో చంద్రబాబు పవన్ లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలను వాళ్లు దూరం పెట్టడంతోనే..ప్రజాసంక్షేమాన్ని వారు అడ్డుకుంటున్నారు కాబట్టే..పేదల కు దోచిపెట్టేస్తున్నారని గుక్క పెట్టి ఏడుస్తున్నారు కాబట్టే చంద్రబాబు, పవన్ లను జనం దూరం పెట్టారు. ఇంకా దూరం పెడతారు.
రేపు ఎన్నికల్లో మరింత దూరం పెట్టడానికి ఏం చేయాలో అదీ చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ముందుగా ప్రజలను ప్రేమించడం నేర్చుకోవాలి. అది వదిలేసి మేం పెత్తందార్ల కొమ్ము కాస్తాం..పేదల పొట్ట కొడతాం.. అయినా అందరూ మా వెంటే ఉండాలంటే కుదిరేపని కాదని ఎల్లో జనం గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment