YSRCP: ‘సిద్ధం’ అంటూ.. సమరోత్సాహంతో కదం తొక్కుతూ.. | Siddham Reviews: Lakhs Ready to Support YSRCP in poll Kurukshetra | Sakshi
Sakshi News home page

YSRCP Siddham: సిద్ధం అంటూ.. సమరోత్సాహంతో కదం తొక్కుతూ..

Published Sun, Mar 10 2024 12:05 PM | Last Updated on Sun, Mar 10 2024 1:10 PM

Siddham Reviews: Lakhs Ready to Support YSRCP in poll Kurukshetra - Sakshi

జనం.. జగన్‌ కలిస్తే ప్రభంజనమేనని మరోసారి రుజువు కాబోతోంది. సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికేందుకు మేదరమెట్ల వైఎస్సార్‌సీపీ సభకు జన వాహిని తరలి రానుంది. గత మూడు సిద్ధం సభలకు మించి లక్షల గొంతుకలు.. పెత్తందారులతో పేదల ప్రభుత్వానికి జరగబోయే యుద్ధానికి మేము సైతం సిద్ధమంటూ గళమెత్తబోతున్నాయి. ఈ దెబ్బకు సోషల్‌ మీడియాలో మరోసారి #Siddham ట్రెండ్‌ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఎన్నికల ముందర.. సిద్ధం పేరిట సన్నద్ధ సభల్ని వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసింది. రాజకీయ దుష్టశక్తుల విషయంలో ఓటర్లను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధిలో.. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ సమీపంలో.. మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పరిధికి సంబంధించి  బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నాల్గో సభను.. ఆఖరి సిద్ధం సభగా నిర్వహిస్తున్నారు.

జనవరి 27వ తేదీన..
ఒకవైపు విశాఖ సముద్రం మరోవైపు జగనన్నపై అభిమానంతో పోటెత్తిన జన సంద్రం చూసి భీమిలి మురిసిపోయింది. కురుక్షేత్రంలో అర్జుడినిమల్లే సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావం పూరించి.. ఢంకా మోగించారు. జగన్‌ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని సీఎం జగన్‌ అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి.

 ఫిబ్రవరి 3వ తేదీన..
ఏలూరు జిల్లా దెందలూరు సిద్ధం సభకు.. 50 నియోజకవర్గాలకు సంబంధించిన కేడర్‌ కదలింది. ముఖ్యంగా యువత పోటెత్తింది. సభా వేదికపైకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. హైవేపై కలపర్రు టోల్‌ ప్లాజ్‌ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.110 ఎకరాల సిద్ధం ప్రాంగణం సరిపోక..  ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు.సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని నేతలు అంచనా వేశారు.  

ఫిబ్రవరి 18వ తేదీన.. 
అనంతపురం రాప్తాడు మూడో సిద్ధం సభ.. దేశ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జరిగింది. రాప్తాడులో  దాదాపు 280 ఎకరాలు జనసముద్రంగా మారిపోయింది. సభా ప్రాంగణం నిండిపోయి బయట ఎదురుచూపులు చూసిన దృశ్యాలు కనిపించాయి. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే..రోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చిందంటూ సీఎం జగన్‌ సైతం అభిమానులకు అభివాదం చేశారు.

మార్చి 10వ తేదీన..
బాపట్ల అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల, పిచ్చుకుల గిడిపాడు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సిద్దం సభకు లక్షల మంది తరలి వస్తున్నారు. జగనన్న పాలనలో పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకుంటున్న పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధం.. పేదలకు జరుగుతున్న మంచిని అడ్డుకునేందుకు జెండాలు జతకట్టే టీడీపీ, జనసేన దోపిడీదారులపై యద్ధానికి సిద్ధం.. అంటూ పిడికిలెత్తి నినాదాలు చేస్తూ సభా ప్రాంగణం వైపు కదులుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement