న్యూక్లియర్‌ రియాక్టర్‌పై పేలిన డ్రోన్‌..ఏమైందంటే.. | Drone Crashes On Chernobyl Nuclear Reactor Roof | Sakshi
Sakshi News home page

న్యూక్లియర్‌ రియాక్టర్‌పై పేలిన డ్రోన్‌..ఏమైందంటే..

Published Fri, Feb 14 2025 6:52 PM | Last Updated on Fri, Feb 14 2025 7:09 PM

Drone Crashes On Chernobyl Nuclear Reactor Roof

కీవ్‌:ఉ‍క్రెయిన్‌లో చెర్నోబిల్‌ అణుప్రమాదం లాంటి మరో దుర్ఘటన తృటిలో తప్పింది. చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో ఉన్న రియాక్టర్‌ 4 రక్షణ కవచాన్ని డ్రోన్‌ ఢీకొట్టి పేలింది. శుక్రవారం(ఫిబ్రవరి14)న జరిగిన ఈ ఘటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధృవీకరించారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలతో కూడిన భారీ వార్‌హెడ్‌ ఉన్నట్లు సమాచారం.

ఇది ఉగ్రవాద చర్య అని ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.రియాక్టర్‌ రక్షణ కవచాన్ని ఢీకొట్టి పేలిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారు.మంటలను ఆర్పివేశారు.అయితే ఈ ప్రమాదంలో రియాక్టర్‌ నుంచి రేడియేషన్‌ లీకవలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) తెలిపింది.

 రియాక్టర్‌ వద్ద రేడియేషన్‌ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లు ప్రకటించింది.కాగా,1986 ఏప్రిల్‌ 26న చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రంలోని అణు రియాక్టర్‌ పేలింది. ఈ ఘటన చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదంగా నిలిచిపోయింది. కాగా, మూడేళ్ల నుంచి జరుగుతున్న రష్యా,ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాల భద్రత ప్రమాదంలో పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement