Chernobyl disaster
-
అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే!
సోవియట్ రష్యాలో అణుప్రమాదం జరిగిన చెర్నోబిల్ పట్టణం సంగతి చాలామందికి తెలుసు. ప్రస్తుతం యుక్రెయిన్ భూభాగంలో ఉన్న చెర్నోబిల్ పట్టణంలోని అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ 1986 ఏప్రిల్ 26న పేలిపోయింది. అప్పటి నుంచి ఈ పట్టణం ఎడారిగా మారింది. ఇప్పటికీ అక్కడి గాలిలో అణుధార్మిక శక్తి వ్యాపించే ఉంది. అక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమే! అయితే, చెర్నోబిల్‌ను తలపించే మరో పట్టణం ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలోని విటెనూమ్లో పట్టణం మరో చెర్నోబిల్‌గా పేరు పొందింది. అలాగని విటెనూమ్ అణు రియాక్టర్ పేలుడు ఏదీ సంభవించలేదు. దశాబ్దాల కిందట ఇక్కడ యాజ్బెస్టాస్ గనులు ఉండేవి. ఈ ప్రాంతంలో 1930ల నుంచి గనులు ఉన్నా, 1947 గోర్జ్ కంపెనీ ఇక్కడి గనులను స్వాధీనం చేసుకుని, గని కార్మికుల కోసం 1950లో ఈ పట్టణాన్ని నిర్మించింది. ఆ తర్వాత 1966 నాటికి గనులు మూతబడ్డాయి. గనులు మూతబడిన తర్వాత కూడా ఇక్కడ జనాలు ఉంటూ వచ్చారు. అయితే, యాజ్బెస్టాస్ ధూళి కణాలు పరిసరాల్లోని గాలిలో వ్యాపించి ఉండటంతో జనాలు తరచు ఆరోగ్య సమస్యలకు లోనయ్యేవారు. వారిలో చాలామంది క్యాన్సర్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇక్కడి ప్రజలను వేరే ప్రదేశాలకు తరలించి, పట్టణాన్ని పూర్తిగా ఖాళీ చేయించింది. ఇప్పటికీ ఇక్కడి గాలిలో ప్రమాదకరమైన యాజ్బెస్టాస్ ధూళికణాలు ఉన్నాయని, ఇక్కడ ఊపిరి తీసుకున్నా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. శాస్త్రవేత్తల సూచన మేరకు ప్రభుత్వం ఈ పట్టణంలో అడుగడుగునా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. జనాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పడిన ఇళ్లు, ప్రార్థన మందిరాలు, బడులు, హోటళ్లు వంటివన్నీ ఇప్పుడు ధూళితో నిండి బోసిగా మిగిలాయి. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
Russia-Ukraine War: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ
ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది. చెర్నోబిల్‌కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్‌లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్‌షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్స్కీ చెప్పారు. -
Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. దీనిని ఆపేందుకు పలు దేశాలు ఎన్ని ఆంక్షలు విధించిన వాటిని లెక్కచేయకుండా రష్యా తన దూకుడుని ఏ మాత్రం తగ్గించడం లేదు. అయితే ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనే చెప్పాలి. ఇప్పటివరకు జరిగినా వినాశనం ఒకటైతే తాజాగా మరో సంఘటన ఉక్రెయిన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ కీలకమే కాకుండా పెద్దదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెర్నోబిల్ జోన్ సమీపంలోని 10,000 హెక్టార్లకు పైగా అడవులు కాలిపోతున్నాయని, ఈ మంటలు ప్లాంట్ సమీపానికి వచ్చే ప్రమాదం ఉందని ఉక్రేనియన్ అధికారి హెచ్చరించారు. సాధారణంగా చెర్నోబిల్ ప్లాంట్ చూట్టు నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో వాహన సంచారం, ఇతరేతర కార్యక్రమాలు ఉండవు. అయితే ఇటీవల రష్యా సైన్యం ఆక్రమించుకోవడంతో వాహన సంచారం ఎక్కువకావడంతో అక్కడి ప్లాంట్‌లోని అణువ్యర్థాలు యాక్టివేట్ అయి ఒక్కసారిగా రేడియేషన్ స్థాయులు పెరిగాయి. ప్రస్తుతం చెర్నోబిల్ సమీపంలో ఉన్న ఈ మంటలు వేడి ప్లాంట్ నిషేదిత ప్రాంతంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడి వాతావరణం వేడిగా మారడంతో పాటు ప్లాంట్‌లో ఉండే కూలింగ్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల రేడియేషన్ పెరుగుతుందని శాస్తవేత్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ఫాక్స్ ఏజెన్సీ ప్రకారం.. చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సమీపంలో కనీసం 31 ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయని, దీని ఫలితంగా రేడియోధార్మిక వాయు కాలుష్యం పెరిగి ఉక్రెయిన్ దేశంతో పాటు పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు చేరుకోవచ్చని చెప్పారు. ఇదే జరిగితే పెను ప్రమాదాన్ని చవి చూడాల్సి వస్తుందని, వాటి ఫలితాలు తీవ్రంగా ఉంటాయని అయన అన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారి డెనిసోవా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
ప్రమాదం ముంగిట ఉక్రెయిన్.. అదే జరిగితే భారీ విస్పోటనం తప్పదు
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాలను రష్యా బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. కాగా, చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విషయంలో అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం(IAEA) ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. తాజాగా.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్‌కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్‌లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్‌ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్‌ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్‌కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంపై రష్యా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ బలగాలు పనిచేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం రష్యా మిలిటరీకి లేదని స్పష్టం చేసింది. తాము చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని, చర్చల ద్వారానే లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య నేడు(బుధవారం) మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రష్యా సైనిక చర్య పక్కా ప్రణాళిక పరంగా ముందుకు సాగుతోందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 -
రష్యా మొండితనం.. సర్వనాశనానికి సెకన్లు చాలు!
న్యూక్లియర్ ప్లాంట్లను యుద్ధంలో భాగం చేయకూడదు. అవి యుద్ధ స్థావరాలు కాకూడదు. ఉక్రెయిన్ జాపోరిజ్జియా అణు కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మాట చెప్తోంది. నిజానికి ఇదేం కొత్త మాట కాదు. అలాగే అదొక హెచ్చరిక. ఈ యుద్ధంలో యూరప్‌లోని అతిపెద్ద అణు రియాక్టర్ గనుక పేలితే?.. యూరప్ మొత్తం తుడిచిపెట్టుకుని పోతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు. శాంపిల్‌గా.. చెర్నోబిల్ విషాదాన్నే ప్రస్తావిస్తున్నారు. సుమారు 36 ఏళ్ల కిందట(ఏప్రిల్ 26, 1986).. ఒక రాత్రి. చిన్నతప్పిదం, ఏమరపాటుతో వ్యవహరించిన తీరు.. సెకన్ల వ్యవధిలోనే అత్యంత విషాదకరమైన విధ్వంసం చోటు చేసుకుంది. అణు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షిస్తున్న సమయంలో.. కరెంట్ సరఫరా ఆపేస్తే ఎలా ఉంటుందనే కోణంలో ప్రయోగాలు చేపట్టారు ఇంజినీర్లు. అయితే అప్పటికే అక్కడ చిన్న సమస్య ఉందని గుర్తించలేకపోయారు. నాలుగో నెంబర్ అణు రియాక్టర్లో కూలింగ్ వాటర్ సరఫరా ఆగిపోయి.. ఆవిరి ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఆ దెబ్బకు రియాక్టర్ మూత ఊడిపోయి అందులోంచి ‘కోర్’ బయటకు లీక్ అయ్యింది. చరిత్రలోనే అతిపెద్ద అణు ప్రమాదం.. పెనువిషాదం చోటు చేసుకుంది. ఘటనలో చెలరేగిన మంటలు పదిరోజుల పాటు మండుతూనే ఉన్నాయి. చెర్నోబిల్ ప్రమాదం జరిగిన టైంలో.. అక్కడికక్కడే చనిపోయింది ఇద్దరే. అటుపై రేడియేషన్ ఎఫెక్ట్‌తో 134 మంది అస్వతస్థకు గురయ్యారు. అందులో 28 మంది కొన్ని నెలలకు, మరికొందరు ఆ తర్వాత చనిపోయారు. కానీ, ఆ ప్రభావం ఏళ్ల తరబడి కొనసాగుతూనే వస్తోంది. ఎంతలా అంటే క్యాన్సర్, చర్మ.. గొంతు సంబంధిత వ్యాధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో సుమారు 2 లక్షల మందికిపైగా చనిపోయారని ఒక అంచనా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని చెర్నోబిల్ ప్రమాదంపై పరిశోధనలు చేసిన రీసెర్చలు చెప్తుంటారు. విశేషం ఏంటంటే.. ఆ విషాదం తాలుకా జ్ఞాపకాలు మోస్తూ ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లూ ఉన్నారు. బతకడం కష్టమే! చెర్నోబిల్ దుర్ఘటనలో విడుదలైన రేడియో ధార్మికత ప్రభావం కొన్ని వేల కిలోమీటర్లకు విస్తరించింది. హిరోషిమా, నాగసాకిల అణు బాంబు పేలుళ్ల కంటే ఎన్నో రెట్ల రేడియో ధార్మికతను విరజిమ్మింది. సుమారు పదమూడు దేశాలకు రేడియేషన్(ఇందులో రష్యా కూడా ఉంది) విస్తరించింది. ఈ ప్రాంతానికి దూరంగా లక్షల మందిని తరలించి.. నిషేధిత ప్రాంతంగా ప్రకటించారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. పదుల కిలోమీటర్ల పరిధిలో గట్టి కాపలా ఉంటుంది. చెర్నోబిల్ దుర్ఘటన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నివాస యోగ్యం కాదు. సాగు కూడా నిషేధం. అక్కడ కాసే పండ్లలో, పూసే పువ్వుల్లోనూ రేడియేషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంటుంది. రేడియేషన్‌ను తట్టుకోలుగుతున్న కొన్ని జంతువులు మాత్రమే బతకగలుగుతున్నాయి. సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్న టైంలో జరిగిన ఈ అణు దుర్ఘటన.. ఇప్పటికీ ప్రభావం చూపెడుతోంది. అందుకే ఇక్కడ రోబోలతో అణువ్యర్థాలకు గోరీ కడుతున్నారు. నిషేధిత ప్రాంతం కాబట్టే.. ఇక్కడ ఒక అణు ఇంధన నిల్వ కేంద్రాన్ని నిర్మించాలని ఉక్రెయిన్ ప్రభుత్వం అనుకుంది. కానీ, యుద్ధ పరిణామాలతో అది రష్యా చేతికి వెళ్లింది. రష్యా ఆక్రమణలో భాగంగా పట్టణాల కంటే ముందుగా చెర్నోబిల్నే ఆక్రమించుకుంది రష్యా. ఆ టైంలో రష్యా అణు యుద్ధానికి దిగుతుందేమో అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అయ్యింది. కావాలనే రష్యా.. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయి. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసు. కాబట్టి జాపోరిజ్జియా Nuclear Plantపై జరిగిన దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదనేది ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆరోపణ. ఒకవేళ ఈ దాడి కావాలనే జరిగినా.. జరిగే నష్టం ఏ రేంజ్లో ఉంటుందో పుతిన్‌కి తెలుసు. ఎందుకంటే చెర్నోబిల్ పరిణామాలను ఆయన దగ్గరుండి చూశాడు.. ఆ ప్రభావానికి గురైన జాబితాలో రష్యా కూడా ఉంది కాబట్టి. అయినా కూడా అణు బూచితో ఉక్రెయిన్ ఆక్రమణలో ముందుకెళ్లాలని చూస్తోంది. ఉక్రెయిన్ను.. మద్ధతుగా వచ్చే దేశాన్ని అణ్వాస్త్ర దాడులతో బూడిద చేస్తామంటూ హెచ్చరిస్తున్నాడు పుతిన్. ఇందులో భాగంగానే ఒకవైపు ప్రధాన నగరాల ఆక్రమణ.. మరోవైపు ఉక్రెయిన్‌లో ఉన్న 15 న్యూక్లియర్ రియాక్టర్ల స్వాధీనం కొనసాగిస్తోంది రష్యా. శుక్రవారం రష్యా బలగాలు దాడి చేసింది, స్వాధీనం చేసుకుంది.. అలాంటి ఇలాంటి రియాక్టర్‌పైన కాదు. యూరప్‌లోనే అతిపెద్ద అణు రియాక్టర్ జాపోరిజ్జియా. జరగరానిది ఏదైనా జరిగితే ఆ విధ్వంసం ఊహించడమే కష్టం. ఎందుకంటే చెర్నోబిల్‌తో పోలిస్తే కొన్ని రెట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. ఉక్రెయిన్ సహా యూరప్ దేశాలు చాలామట్టుకు నామ రూపాలు లేకుండా పోవచ్చు. ఆఖరికి రష్యా కూడా ఆ ప్రతిఫలం అనుభవించాల్సిందే. జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్‌లోని ఆరు రియాక్టర్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది రిన్నోవేషన్లో ఉంది. ఆపరేటింగ్‌లో లేదు. అయితే అందులో అణు ఇంధనం మాత్రం ఉంది. ఆ ఇంధనం కూడా రష్యా నుంచే వచ్చింది. మంటలు అంటుకున్నాక ఆర్పడానికి రష్యా దళాలు ఫైర్ సిబ్బందిని అనుమతించలేదు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ నెలకొంది. ఆపై సిబ్బంది అనుమతించడంతో సమయానికి మంటలు ఆపేశారు. ఘోర ముప్పు తప్పింది. అక్కడి వాతావరణంలో రేడియేషన్ లెవల్ కూడా మారలేదు. పుతిన్ ‘అణు దాడి’ హెచ్చరికల వరకు పరిమితం అయితే పర్వాలేదు. చెర్నోబిల్‌లో జరిగిన ఒక చిన్నతప్పిదానికే ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంటే.. కావాలని దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే.. ఆ ప్రభావం ఇంకా ఏ రేంజ్లో ఊహించడమే భయంకరంగా ఉంది. ::: సాక్షి, వెబ్ ప్రత్యేకం -
అగ్నికీలల్లో ఉక్రెయిన్ అణుప్లాంట్.. పేలితే పెనువిషాదమే!
రష్యా వైమానిక దాడుల్లో యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జాపోరిజ్జియా అగ్నికీలల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆగ్నేయం వైపు నైపర్ నదీ తీరాన ఉంది జాపోరిజ్జియా పారిశ్రామిక నగరం. ఇక్కడే యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్‌ను నెలకొల్పారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు ఈ ప్లాంట్‌పై రాకెట్ లాంఛర్లతో దాడికి తెగబడ్డాయి. నలువైపులా దాడులు చేయడంతో.. ప్లాంట్ మంటల్లో చిక్కుకుంది. Russian RPG attack on #Zaporizhzhia nuclear power plant #UkraineRussianWar #Ukriane ⚠️⚠️🚨🚨⚠️🚨🚨🌎🚀🇺🇦 pic.twitter.com/EPz6nH4Ug8 — UKRAİNİAN 💎 (@donetekk) March 4, 2022 ఉక్రెయిన్‌కు దాదాపు 40 శాతం అణు విద్యుత్ ఈ స్టేషన్ నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని అణు ప్లాంట్లను టార్గెట్ చేసింది. జాపోరిజ్జియా గనుక పేలిందంటే.. చెర్నోబిల్ విషాదం(1986లో జరిగిన పెను విషాదం) కంటే ఘోరంగా డ్యామేజ్ ఉంటుందని, రేడియేషన్ ఎఫెక్ట్ చెర్నోబిల్ కంటే పదిరెట్లు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని కుబేలా ప్రకటించారు. రష్యన్లు వెంటనే దాడుల్ని ఆపివేయాలి, అగ్నిమాపక సిబ్బందిని అనుమతించాలి, ఆ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా ఏర్పాటు చేయాల్సిందే అని ట్వీట్ చేశారు కుబేలా. #Ukraine tells IAEA that fire at site of #Zaporizhzhia Nuclear Power Plant has not affected “essential” equipment, plant personnel taking mitigatory actions. — IAEA - International Atomic Energy Agency (@iaeaorg) March 4, 2022 మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్న సమయంలోనూ రష్యా దాడులు కొనసాగినట్లు సమాచారం. అయితే జాపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ ప్రదేశంలో జరిగిన అగ్నిప్రమాదం.. కీలకమైన విభాగాల్ని ప్రభావితం చేయలేదని, ప్లాంట్ సిబ్బంది ఉపశమన చర్యలు తీసుకుంటున్నారని ఉక్రెయిన్ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి (IAEA) వెల్లడించింది. ఈ దాడులపై అమెరికా, ఉక్రెయిన్ను ఆరా తీసింది. మరోవైపు ఉక్రెయిన్ సహా పాశ్చాత్య దేశాలు న్యూక్లియర్ ప్లాంట్లపై దాడుల్ని చేయొద్దంటూ రష్యాను కోరుతున్నాయి. -
రష్యా వ్యూహాత్మక అడుగులు.. అందులో భాగమే శిథిల ‘చెర్నోబిల్’ స్వాధీనం
కీవ్: చెర్నోబిల్.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడతాయి.1986లో అతి పెద్ద అణు పేలుడు సంభవించి ప్రపంచ విషాదంగా నిలిచిన మరుభూమిలాంటి ప్రాంతం. ఇప్పుడు అది రష్యా స్వాధీనంలోకి రావడం ఆందోళనలు పెంచుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రలో మొట్టమొదటి సారిగా రష్యా వ్యూహాత్మకంగానే చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకుందన్న చర్చ కూడా సాగుతోంది. ►చెర్నోబిల్ పట్టణం.. ఇప్పుడు అదొక మరుభూమి. ఉక్రెయిన్ సరిహద్దులైన బెలారస్‌కు 20 కి.మీ. దూరంలో ఉంటుంది. భూ, వాయు, జలమార్గాల ద్వారా ముప్పేట దాడికి సిద్ధమైన రష్యా పక్కా ప్రణాళికతో చెర్నోబిల్‌ను తొలుత స్వాధీనం చేసుకుంది. ఆ దేశంలోకి చేరాలంటే చెర్నోబిల్ దగ్గర దారి కావడంతో దానికి అనుగుణంగా అడుగులు వేసింది. బెలారస్ రష్యా మిత్రపక్షాల్లో ఒకటి కావడంతో ఆ సరిహద్దుల నుంచి సైన్యాన్ని తరలించానికి వీలైంది. ►సరిహద్దులకి సమీపంలోనే ఉండడంతో చెర్నోబిల్ రష్యాకు ఈజీ టార్గెట్‌గా మారింది. అంతేకాకుండా చెర్నోబిల్ చుట్టూ 2,600 చదరపు కిలోమీటర్ల మేర నిషేధిత ప్రాంతం కావడంతో సైనికులు ఉండరు. అణు కార్యకలాపాలు కూడా జరగకపోవడంతో భద్రత తక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ్నుంచి రష్యా సేనలు ముందుకు వెళ్లడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. చదవండి: (కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్స్కీ ప్రస్థానం) ►భౌగోళికంగా చూస్తే చెర్నోబిల్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం 108 కి.మీ. దూరంలో ఉంటుంది. దీంతో చెర్నోబిల్‌ను ఆక్రమించుకుంటే రాజధాని స్వాధీనానికి ఎక్కువ సమయం పట్టదని రష్యా ప్రణాళికలు వేసుకుంది. ►మిలటరీ పరంగా చెర్నోబిల్‌కు ఎలాంటి ప్రాముఖ్యత లేకపోయినప్పటికీ ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని భావిస్తున్న పుతిన్ లక్ష్యం చేరుకోవాలంటే ఈ ప్రాంతం అత్యంత కీలకంగా ఉందని అమెరికా ఆర్మీ మాజీ చీఫ్ జాక్ కీన్ వ్యాఖ్యానించారు. ►చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా స్వాధీనం చేసుకుందని అంటే దానిని వినియోగించుకోవడానికి కాదని, పశ్చిమ దేశాలు తమ దారికి అడ్డుగా వస్తే ఏమైనా చేస్తామని హెచ్చరికలు పంపడానికేనన్న అభిప్రాయాలున్నాయి. చదవండి: (యువత జీవితాలతో క్రూర పరిహాసం) ►సోవియెట్ రష్యా పతనానికి చెర్నోబిల్ అణుబాంబు పేలుడు కూడా ఒక రకంగా కారణభూతమైంది. అప్పట్లో జరిగిన ఈ భారీ పేలుడుతో వెలువడిన అణు ధార్మికత ఉక్రెయిన్, బెలారస్, రష్యా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారికంగా వాటి లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రేడియేషన్ కారణంగా అణు విద్యుత్ ప్లాంట్ చుట్టుపక్కల కొన్ని వేల ఏళ్ల వరకు జీవనం సాగించే పరిస్థితి లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతిమ లక్ష్యం తిరిగి సోవియెట్ యూనియన్ స్థాపించడం కావడంతో చెర్నోబిల్ స్వాధీనంపై ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
పంతం నెగ్గించుకున్న రష్యా
మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటి తేలియాడే అణు రియాక్టర్‌ను రష్యా ప్రారంభించింది. పర్యావరణవేత్తలు, సంస్థలు ఎంత హెచ్చరించినప్పటికీ వినని రష్యా.. తన పంతం నెగ్గించుకుంది. అకడమిక్ లొమొనొసొవ్గా పిలిచే ఈ రియాక్టర్ తన తొలి ప్రయాణంలో భాగంగా 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య సైబీరియాలోని పెవెక్ అనే ప్రాంతానికి బయలుదేరింది. అక్కడి అణు కేంద్రాన్ని, మూతబడిన బొగ్గు కర్మాగారాన్ని ఇది భర్తీ చేయనుంది. ఎప్పుడు మంచుతో కప్పి ఉండే సంప్రదాయక అణు కేంద్రాలకు ఇలాంటి తేలియాడే రియాక్టర్లు మంచి ప్రత్యామ్నాయమని అణు పరిశోధన సంస్థ రొసాటోం పేర్కొంది. వీటిని ఇతర దేశాలకు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. కాగా ఈ తేలియాడే అణు రియాక్టర్లు మంచుపై ఉండే చెర్నోబిల్ లాంటివని, అణు బాంబుపూరిత టైటానిక్ లాంటివని, వీటితో ప్రమాదముంటుందని ఎన్నో పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఈ రియాక్టర్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని రష్యా ఆలోచిస్తోంది. ముఖ్యంగా చమురు లభించే ప్రాంతాల్లో వీటిని వినియోగించనుంది. (చదవండి: మళ్లీ అణ్వాయుధ పోటీ!) -
చెర్నోబిల్ చుట్టూ రాతి నిర్మాణాలు
కీవ్: ప్రపంచంలో అత్యంత దురదృష్టకర న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంగా చెప్పుకునే చెర్నోబిల్ విషాదానికి ఏప్రిల్ 26తో 30 ఏళ్లు నిండనున్నాయి. ఈ ఘటన జరిగి 3 దశాబ్దాలు కావస్తున్నప్పటికీ ఆ విషాదం వారిని వెంటాడుతూనే ఉంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రభుత్వం నాడు పేలిన రియాక్టర్ చుట్టూ రాతితో నిర్మితమైన పెట్టెలను అమర్చాలని నిర్ణయించుకుంది. రియాక్టర్లో ఇంకా 200 టన్నుల యూరేనియం నిల్వ ఉండండంతో పాటు దాని చుట్టూ ఉన్న కాంక్రీటు నిర్మాణం ఇప్పటికే పాతబడింది. దాని నుంచి ఎప్పుడైనా రేడియో ధార్మిక కిరణాలు విడుదలయ్యే ప్రమాదం ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీటికి నిధులను సమకూర్చే విషయమై చర్చించేందుకు అంతర్జాతీయ దాతలు ఈ నెల 25న సమావేశం కానున్నారు. 1986 ఏప్రిల్ 26న సంభవించిన ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారన్న లెక్కలు ఇప్పటికీ తేలలేకపోవడం గమనార్హం. ఐరోపాలో మూడు వంతుల భూభాగాన్ని ఈ ఘటన ప్రభావితం చేసింది.