పింక్‌ స్టేషన్‌లు | Free Sanitary Pads Available At All Noida Metro Stations | Sakshi
Sakshi News home page

పింక్‌ స్టేషన్‌లు

Published Mon, Mar 9 2020 8:40 AM | Last Updated on Mon, Mar 9 2020 8:40 AM

Free Sanitary Pads Available At All Noida Metro Stations - Sakshi

నిన్నటి నుంచి నోయిడా మెట్రో రైల్‌ కార్పోరేషన్‌.. ఆక్వా లైన్‌లో ఉన్న (ఇందులోకి నోయిడా, గ్రేటర్‌ నోయిడా వస్తాయి) మొత్తం 21 స్టేషన్‌లలో శానిటరీ ప్యాడ్స్‌ని ఉచితంగా అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. అంతేకాదు, ఈ స్టేషన్‌లలో రెండింటిని ‘పింక్‌ స్టేషన్స్‌’గా మార్చారు. పింక్‌ స్టేషన్‌లలో తల్లి బిడ్డకు పాలివ్వడానికి, డయపర్స్‌ మార్చడానికి ప్రత్యేకమైన గదులు, వసతులు ఉంటాయి. అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారు. నోయిడా లోని ‘సెక్టార్‌ 29’, గ్రేటర్‌ నోయిడాలోని ‘పరీ చౌక్‌’ స్టేషన్‌లకు ఈ పింక్‌ స్టేషన్‌ హోదాను ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ మహిళా ప్రయాణికుల కోసం మెరుగుపరిచిన సదుపాయాలివి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement