
ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం మెట్రో రైల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. మెట్రో అందుబాటులోకి రావడంతో ఎంతోమంది ఉద్యోగులకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి. మెట్రో ద్వారా కొన్ని లక్షల మంది తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకుంటున్నారు. అయితే మెట్రోలో కొందరి ప్రవర్తనల వల్ల ఇబ్బందికర సంఘటనలను ఎదుర్కొన్నాల్సి వస్తుంది. అలాగే వారి చేసే చేష్టలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. (వివాదాస్పద ట్వీట్.. రంగోలి ట్విటర్ ఖాతా తొలగింపు )
తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇండియా టుడే మీడియా సంస్థ తమ ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మెట్రోలో ఒంటరిగా ఉన్న ఓ యువతి తన ఇష్టారీతిగా వ్యవహరిస్తుంది. పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతూ, ఫోన్లో గట్టి గట్టిగా అరుస్తూ చుట్టు ఉన్న వాళ్లకు ఇబ్బంది కల్గిస్తుంది. రద్దీగా ఉన్న మెట్రోలో కూర్చోడానికి అబద్దాలను సాకులుగా చెబుతూ అందరి చేత నవ్వూల పూలు పూయిస్తుంది. అయితే ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీసిందో తెలీదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మీకు కూడా మెట్రోలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. మరి ఈ వీడియోను చూసి ఓసారి వాటిని గుర్తు తెచ్చుకోండి. (‘మా ఆవిడకి నా పని నచ్చలేదు’ )
చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment