హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఆదివారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, కూకట్ పల్లి, పంజాగుట్ట, బేగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, అంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో నగరంలోని ఆయా ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే డ్రైనేజీలన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. నాలాలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ప్రతి రోజూ కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయానికి గురికావాల్సి వస్తోంది. పలుప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు జగద్గిరిగుట్ట 8.5 సెం.మీ, షాపూర్ 7.6సెం.మీ, జీడిమెట్ల 7.5సెం.మీ, గాజుల రామరం 7.4సెం.మీ, జహీరాబాద్ 6.5సెం.మీ, దూలాపల్లి 6సెం.మీ గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment