
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైనప్పటికీ నైరుతి రుతుపవనాలు ఇంకా రాష్ట్రం నుంచి ఉపసంహరణ కాలేదు. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు నమోదవుతాయని, బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమో దుకావొచ్చంది. కొన్నిచోట్ల 7 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.