Telangana & Hyderabad Heavy Rains Alert Updates
రాజధాని హైదరాబాద్‌లో పలుచోట్ల మళ్లీ భారీ వర్షం
ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, టోలిచౌకీ, లంగర్‌హౌజ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టలో భారీ వర్షం
కుండపోత వానతో రోడ్లపై వాహనదారుల ఇబ్బందులు
అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు
మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది.
హుస్సేన్‌సాగర్‌కు పెరిగిన నీటి మట్టం
- ఉదయం 8గం. వరకు 513.55 మీటర్ల నీటి మట్టం
- ఇన్‌ఫ్లో 1,850 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,600 క్యూసెక్కులు
- అప్రమత్తమైన అధికారులు
ఎల్బీ స్టేడియం వద్ద కూలిన గోడ
రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం వద్ద నేల కూలిన భారీ వృక్షం
చెట్టు పడిపోవడంతో కూలిన ప్రహారీ గోడ
పలు పోలీసు వాహనాలు ధ్వంసం
బషీర్‌బాగ్ సీసీఎస్ పాత కార్యాలయం వద్ద ఘటన
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది జీహెచ్‌ఎంసీ
మరోసారి కుండపోత వాన కురుస్తుందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని హెచ్చరించింది
ప్రధాన కూడళ్లలో మోకాల కంటే పైన నీరు పేరుకుపోయింది
కాలనీలు, బస్తీలు చెరువుల్లా మారిపోయాయి
వాటర్ లాగిన పాయింట్ల వద్ద నీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు
అత్యవసర సేవల కోసం టోల్‌ఫ్రీ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ కోరుతోంది.
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొర్లడంతో పాటు పలు కాలనీలు, రోడ్లపైకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జంట నగరాల్లో ఈ వేకువ జాము నుంచి ఉరుములు, పిడుగులతో కుండపోత కురుస్తోంది. మరో నాలుగు రోజులపాటు ఇలాంటి పరిస్థితి తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
హైదరాబాద్‌లో రామ్ నగర్‌లో భారీ వర్షానికి ఒకరు మృతి చెందారు. ఒక్కసారిగా రోడ్డు మీద నీరు పెరిగిపోవడంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి.. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పార్శి గుట్ట నుంచి రామ్ నగర్‌కు మృతదేహం కొట్టకు వచ్చింది. మృతి చెందిన వ్యక్తిని రామ్ నగర్‌కు చెందిన అనిల్‌గా గుర్తించారు.
మరోవైపు.. రోడ్లపై భారీ నీరు పేరుకుపోవడంతో.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలను బయటకు రానివ్వొద్దని అధికారులు కోరుతున్నారు.
నగరంలో పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్‌లలోకి నీరు చేరింది. పలు కాలనీలు నీట మునిగాయి. బైకులు, కార్లు కొట్టకుపోయాయి.
దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షం.. మంగళవారం వేకువజామును మరోసారి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధప్రతిపాదికన చర్యల్లో పాల్గొంటున్నాయి.
వర్ష బీభత్సం.. హైలెట్స్
నీట మునిగిన బస్తీలు, కాలనీలు
కొట్టుకుపోయిన కార్లు, బైకులు
రామ్, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీల్లో నడుం అంచు వరకు నీరు
ప్రమాదం అంచుల్లో పార్సిగుట్టలోని పలు పప్రాంతాలు
జంట నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఉధృతంగా నీరు.. పంజాగుట్ట, లక్డీకాపూల్‌లో మోకాల లోతు దాకా నీరు
హైటెక్ సిటీ దగ్గర చెరువును తలపిస్తున్న రోడ్లు
రాకపోకలకు అవాంతంర.. వాహనదారులకు ఇబ్బందులు
చాలా చోట్ల 10 సెం.మీ. లకు పైగా వర్షపాతం నమోదు అయ్యింది
యూసఫ్‌గూఢలో అత్యధికంగా 11 సెం.మీ. వర్షం పడింది
Heavy rain 🌨️in many areas of hyderabad⚡ , Stay home and be safe.🏊🏊#HyderabadRains #Hyderabad#HyderabadRains #Hyderabad pic.twitter.com/ghaon2UJRg
— Tabrez Alam (@Tabrez_saab) August 20, 2024
మరోవైపు.. తెలంగాణ అంతటా ఇంకో నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జనగామ, గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, సిద్ధిపేట, వనపర్తికి ఐఎండీ వర్ష సూచన చేసింది.రంగారెడ్డి,సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడొచ్చని హెచ్చరించింది.ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heavy in Hyderabad. The roads are flooded and people are facing of problems 🌨️🌨️🌨️🌨️#HyderabadRains #earthquake pic.twitter.com/u82iTtn7rt
— Vandana Meena (@vannumeena0) August 20, 2024
Comments
Please login to add a commentAdd a comment