అలుముకున్న క్యూములోనింబస్ మేఘాలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, శివారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రెండ్రోజుల పాటు ఈదురుగాలులతో భారీ వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని గురువారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ తో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
మరోవైపు.. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే.. మూడురోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కపోతతో చంపేస్తున్న హైదరాబాద్ వాతావరణం.. హఠాత్తుగా మారిపోయింది. శుక్రవారం నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మేఘం విరిగిపడిందా? అన్నట్లు వాన కురిసింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్.. చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన పడింది. క్యూములోనింబస్ మేఘాలు ముసురుకోవడంతో.. ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. సెలవు రోజు కావడంతో ట్రాఫిక్ చిక్కులు పెద్దగా లేకపోయినా రోడ్లపై నీరు పేరుకుపోవడంతో నగర వాసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Heavy heavy Rain in Ameerpet...#Hyderabadrains #Hyderabad pic.twitter.com/5TUtwQGcyt
— Srinu Nattu vidyam (@srinu18_srinu) August 15, 2024
UCHAKOTHA RAINS ⚠️
The heaviest rainfall of this season is now ramping across Hyderabad. This will turn into PAN HYDERABAD SHOW now next 30min. Please stay alert Hyderabad. This will reduce only after 8/8.30pm. Take care of your parked viechles. This is not an ordinary storm…— Telangana Weatherman (@balaji25_t) August 15, 2024
#PragathiNagar getting lashed by a heavy spell of rain@balaji25_t @HYDmeterologist @Rajani_Weather @HiHyderabad #Telanganarains #Telangana #Hyderabad #Monsoon2024 pic.twitter.com/np0EpDkFMD
— Indraja M (@IndrajaBellam19) August 15, 2024
హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. చుట్టుపక్కల జిల్లాలకు కూడా అదే అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డిలో ఎడతెరిపి లేకుండా భారీ వాన పడుతోంది. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బీరంగూడ, అమీన్‌పూర, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, కిష్ణారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment