
Hyderabad Rain Alert: హైదరాబాద్ నగరంలో ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే...
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నగరంలో గరిష్టంగా 39.2 డిగ్రీలు, కనిష్టంగా 29.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని ప్రకటించింది.
20న ‘మ్యూజియం’ ఉచిత సందర్శన
చార్మినార్: అంతర్జాతీయ మ్యూజియం వారోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 20న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాలార్జంగ్ మ్యూజియం తెరిచి ఉంటుందని... ఆ రోజు చిన్నారులు, అనాథ పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ ఎ.నాగేందర్ రెడ్డి తెలిపారు. ఉచిత ప్రవేశం కోసం ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు లిస్టు అందజేయాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?