సాక్షి, హైదరాబాద్: నగరాన్ని Hyderabad Rains మరోసారి వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది. రోడ్లు, లోతట్టు పప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులకు జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.
అమీర్‌పేట, కోఠి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బేగంపేట్, వారసిగూడ, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన హెచ్చరికలూ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తోంది.
☔ #HyderabadRains #Hyderabad pic.twitter.com/SsDkwSiJ34
— Shaandaar Hyderabad (@swachhhyd) April 29, 2023
#HyderabadRains Always wanted to do this.. pic.twitter.com/l0Q9nohShT
— Ankush Tweets (@ankushbidayat7) April 29, 2023
తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాలు వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకోగా.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది.
#Early this morning, it raining in #HyderabadRains. pic.twitter.com/8KwJ5O1meN
— innocent Banda (@Baag786) April 29, 2023
Ala vidhwamsam modalu #HyderabadRains , just miss 😄 pic.twitter.com/Y7DMLOZTqQ
— Sunny (@Dr_S_Chanamolu) April 29, 2023
Heavy rain at #Manikonda #Hyderabad #HyderabadRains pic.twitter.com/fm7ODi7k6m
— BOSS Fan (@chintu002) April 29, 2023
రాళ్ల వాన(వడగండ్ల) నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వడగండ్లకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు రామచంద్రపురం ఆమీన్పూర్ లో భారీ వర్షం కురుస్తోంది. మహాబూబ్‌నగర్‌లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు వడగండ్లతో కూడిన భారీ వాన హెచ్చరికలు జారీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment