
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 4.5 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
బుధవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదయ్యాయని పేర్కొంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రానున్న రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment